India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 919 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, 47,548 మంది చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పౌష్టికాహారం అందించనున్నారు. ఉదయం అల్పాహారం లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఈ పథకం ఉపశమనంగా మారనుంది.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో అనుమానస్పదంగా యువతి మృతి చెందింది. తండాకు చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఇంట్లో కనిపించింది. ప్రేమ పేరుతో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు వేధించి రేప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఎయిడ్స్‌పై సమాజంలో సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకమని కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం KMC నుంచి MGM వరకు నిర్వహించిన “AIDS Awareness & Prevention Campaign Day” ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలిలో నిర్వహించిన మానవహారంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానం సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.502.83 కోట్ల లక్ష్యానికి గాను 7,242 సంఘాలకు రూ.508.14 కోట్లు పంపిణీ చేసి 100%కు పైగా ప్రగతి నమోదు చేసింది. మేడ్చల్ మొదటి, పెద్దపల్లి రెండో స్థానాల్లో ఉండగా వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ రంగాల్లో రుణాలు అందిస్తున్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు అందుకున్న ఎంజీఎం, కేఎంసీ వైద్యులను కలెక్టర్ సత్య శారద అభినందించారు. బుధవారం కేఎంసీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఆర్థోపెడిక్ విభాగంలో 653 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, నెఫ్రాలజీలో 24,709 మందికి డయాలసిస్ సేవలు అందించి రికార్డు సృష్టించడం అభినందనీయమన్నారు. మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

వేయి పడకల ఎంజీఎంలో రోగుల సంక్షేమం కోసం అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓపి తర్వాత వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్లు రాసిచ్చిన మందుల చీటీ పట్టుకుని రోగులు చాంతాడంత లైన్లో నిలబడి ఉన్నా కొందరికి మందులు లభించక వెళ్లిపోతున్న సంఘటనలు ఎంజీఎంలో నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం మరొక మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం ‘సురక్షిత మాతృత్వ దినోత్సవం’ జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతోందని, సాగు ఖర్చులు పెరిగి రైతుల ఆదాయాలు దెబ్బతింటున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు లేదా సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెడుతున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అమోఘం. ఉమ్మడి వరంగల్‌లో 109 మంది ఈఎంటీలు గడిచిన ఏడాదిలో 1,17,054 మందిని కాపాడారు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సమయస్ఫూర్తితో MGMకు తరలించిన కర్ణాకర్ వంటి వారు ఎందరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ‘జాతీయ ఈఎంటీ దినోత్సవం’.
Sorry, no posts matched your criteria.