Warangal

News April 2, 2026

వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.

News April 2, 2026

గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

News April 2, 2026

శోకసంద్రమైన బోడ మాణిక్యం తండా!

image

హైదరాబాద్‌లో తల్లి స్రవంతి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. తల్లి స్రవంతి, చిన్నారుల మృతదేహాలు బోడ మాణిక్యం తండాకు బుధవారం చేరుకున్నాయి. పార్థివ దేహాలను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండా మొత్తం దుఃఖసంద్రంగా మారి ఆర్తనాదాలతో మార్మోగింది. ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతోంది.

News April 1, 2026

వరంగల్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

వరంగల్: రేపు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని 317 గ్రామాలు, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల వెల్లడి, అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరిస్తారు.

News April 1, 2026

CMR బకాయిలపై కఠిన చర్యలు.. మిల్లర్లకు నోటీసులు

image

హనుమకొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు 12 మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా ఉండగా, వీరివద్ద సుమారు రూ.80.96 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు, రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ద్వారా బకాయిల వసూళ్లకు చర్యలు ప్రారంభించారు.