India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ సమయంలోనైనా తుపాన్ ముప్పు, ఏ క్షణమైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భారీ వరదలు, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని, ఈనెల 27 వరకు ఏ రోజైనా, ఎక్కడైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
వరంగల్ జిల్లాలో కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు నిబద్ధతతో పని చేసి పారదర్శక పరిపాలన అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని, అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగట్లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీలో ఎండోమెంట్ గవర్నమెంటు ప్లీడర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఎండోమెంట్ కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి 6 నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆలోచనల మేరకు జిల్లాలోని 107 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, విద్యాసంస్థల్లో శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, మానసిక దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల శ్రేయస్సుపై చర్చించారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరంలా మారిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు ఈరోజు ఎంపీ CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.6,87,500 విలువల చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే-163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ, పర్వతగిరి మండలాల రైతులతో ఆర్బిట్రేషన్ సమావేశం జరిగింది. భూస్వాములకు అవార్డ్ పాస్ చేసే దిశగా చర్చలు జరిగాయి. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవోలు, తహశీల్దార్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరి యూడైస్, ఆధార్, తదితర అన్ని వివరాలు నవీకరించుకోవాలని DIEO డా.శ్రీధర్ సుమన్ అన్నారు. నర్సంపేట మైనారిటీ బాలికల కళాశాలలో అడ్మీషన్, అపార్, తదితర రికార్డులను DIEO పరిశీలించారు. జిల్లాలోని 67 కళాశాలల్లో అడ్మీషన్ పొందిన విద్యార్థుల అన్ని వివరాలను నవీకరించడానికి సంబంధిత కళాశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని DIEO అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం 26 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో గుడుంబా గంజాయి నిర్మూలనకు ప్రతినెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.
బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.