India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో గురువారం భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ(DST), తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన సాంకేతిక మండలి ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల మేధో సంపత్తి హక్కుల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ తెలిపారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్‌కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.

ఉత్తరాది రుచులు ఇక్కడి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలసదారులు వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట డాబాలను ఏర్పాటు చేసి అక్కడి రోటితో పాటు పలు కర్రీలు చేస్తూ రుచులు చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వంటకాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.
Sorry, no posts matched your criteria.