News October 25, 2024

హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?

image

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News October 25, 2024

SHOCKING: షుగర్, బీపీలా 8 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ డిజార్డర్

image

డిజిటల్ విప్లవం అనేక మార్పులతో పాటు కొన్ని రోగాల్నీ తెచ్చిపెట్టింది. అందుకిదే ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల మంది గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేదా జూదరోగంతో బాధపడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ఆన్‌లైన్ క్యాసినో, గేమ్స్, బెట్టింగ్ మార్కెట్లే ఇందుకు కారణమంది. ఈజీ మనీ పేరుతో పిల్లలు, పెద్దలు వీటికి ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. మొత్తంగా 44 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ రిస్క్ ఉన్నట్టు వెల్లడించింది.

News October 25, 2024

INTERESTING: తల నరికినా రెండేళ్లు బతికిన కోడి!

image

ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని(US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్‌లో పెట్టి ఐడ్రాపర్‌ని ఉపయోగించి ఆహారం అందించాడు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1947లో అది మరణించింది.

News October 25, 2024

యూట్యూబ్ నుంచి అదిరిపోయే ఫీచర్

image

యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల కోసం షాపింగ్ అఫ్లియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు వీడియోలు, షార్ట్స్ ద్వారా నేరుగా మింత్రా, ఫ్లిప్‌కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య కనెక్షన్‌ను బలపరుస్తోందని యూట్యూబ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.