News May 17, 2024

అతనికి భయపడి మాట మార్చారు: స్వాతి మాలివాల్

image

కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగం అని ఆప్ మంత్రి ఆతిశీ వ్యాఖ్యానించడంపై ఎంపీ స్వాతి మాలివాల్ మండిపడ్డారు. పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లు తనపై బీజేపీ ఏజెంట్ అనే ముద్ర వేశారని అన్నారు. రెండు రోజుల క్రితం దాడి జరిగినట్లు అంగీకరించిన పార్టీ.. ఇవాళ మాట మార్చిందని పేర్కొన్నారు. ‘ఆ గూండా(బిభవ్) పార్టీ సీక్రెట్లు బయటపెడతాడని భయపడుతున్నారు’ అని ఆరోపించారు.

Similar News

News January 12, 2025

‘రిపబ్లిక్ డే’ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు?

image

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించాలని భారత సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో పీఎం మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. సుబియాంటో గత ఏడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించారు. నిరుడు రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

News January 12, 2025

రాష్ట్రంలో సంక్రాంతి సందడి లేదు: YCP

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి సందడి కానరావడం లేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘ప్రజల చేతుల్లో డబ్బుల్లేక ఎక్కడా కొనుగోళ్లు లేవు. దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు ఆడడం లేదు. దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ఉండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు పండగ చప్పగా ఉందని చెబుతున్నారు’ అని పేర్కొంది.

News January 12, 2025

అకౌంట్లలోకి రూ.12,000.. మార్గదర్శకాలు విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. ROFR పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది.