News November 27, 2024

సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలు బ్యాన్!

image

ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ(102ఓట్లు అనుకూలం, 13వ్యతిరేకం)ఆమోదం లభించగా సెనెట్‌కు పంపింది. అక్కడ పాసై అమల్లోకి వస్తే టిక్‌టాక్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి. లేకపోతే 50 మిలియన్ డాలర్ల ఫైన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Similar News

News November 27, 2024

ఐసీసీ ర్యాంకింగ్స్: తొలి స్థానంలో బుమ్రా

image

ICC ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో జైస్వాల్ రెండో స్థానంలో, పంత్ 6, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తొలి స్థానం, అశ్విన్ 4, జడేజా 7వ స్థానం పొందారు. ఆల్ రౌండర్లలో జడేజా తొలి స్థానం, అశ్విన్ 2, అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచారు. ఇటీవల AUSతో తొలి టెస్టులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయగా, బుమ్రా 8 వికెట్లతో రాణించారు.

News November 27, 2024

మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు

image

రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదంది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని TN యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ తెలిపింది.

News November 27, 2024

మేం చెప్పినట్టు అదానీని అరెస్టు చేయాలి: రాహుల్ గాంధీ

image

అమెరికా DOJ అభియోగాలను అదానీ గ్రూప్ ఖండిస్తుందని ముందే ఊహించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘అభియోగాలను అదానీ అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా అలా చేయరు. అసలు పాయింట్ ఏంటంటే మేం చెప్పినట్టుగా ఆయన్ను అరెస్టు చేయడం. చిన్న చిన్న అభియోగాలకే వందలమంది అరెస్టయ్యారు. రూ.వేలకోట్ల వ్యవహారంలో ఆ జెంటిల్‌మన్ (అదానీ)పై US అభియోగాలు మోపింది. ఆయన జైల్లో ఉండాలి’ అని అన్నారు.