News February 21, 2025
CONFIRM: గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్

తన బయోపిక్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తారని మాజీ క్రికెటర్ గంగూలీ వెల్లడించారు. అయితే డేట్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి ఏడాది టైమ్ పడుతుందని చెప్పారు. గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.
Similar News
News February 22, 2025
ఎల్లుండి నుంచి ఇస్రో ‘యువికా’ దరఖాస్తుల స్వీకరణ

ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ ‘యువికా’కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. వచ్చే నెల 23 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణనిస్తారు.
News February 22, 2025
ఆ రోజున సెలవు

TG: MLC ఎన్నికల నేపథ్యంలో FEB 27న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ MLC, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్, ఇదే స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నిక ఆరోజున జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ఇచ్చింది. అటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొనేలా కంపెనీలు సహకరించాలని ఈసీ కోరింది.
News February 22, 2025
నేడు టీ-శాట్‌లో ‘పది’ పాఠాలు

TG: ఇవాళ టీ-శాట్ ఛానెల్‌లో పదో తరగతి పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉ.9.30 గంటల నుంచి సా.5 గంటల వరకు టెలికాస్ట్ కానున్నట్లు SCERT సంచాలకుడు రమేశ్ తెలిపారు. వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు బోధించనున్నారు. విద్యార్థులు ప్రసారాలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.