News April 7, 2024
హాట్ సమ్మర్‌లో కూల్ కాటన్
వేసవిలో కారిపోతున్న చెమటలు, ఉక్కపోత చికాకు పెట్టిస్తుంటాయి. మధ్యాహ్న సమయంలో బయట అడుగు పెట్టాలన్నా, ప్రయాణాలు చేయడమంటే సాహసమే. ఇలాంటి సందర్భాల్లో ఎండ నుంచి తట్టుకునేందుకు కాటన్ దుస్తులు ధరించాలని పెద్దలు చెబుతున్నారు. ఇవి ఒంటిపై చెమటను పీల్చి, చల్లదనాన్ని అందిస్తాయి. అయితే ప్యూర్ కాటన్ వస్త్రాలు మాత్రమే వాడటం మంచిదట. ఇక వేసవిలో డార్క్, బ్లాక్ కలర్ డ్రెస్సులు వాడకపోవమే మంచిది.
Similar News
News November 14, 2024
అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్‌ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్‌గా, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
News November 14, 2024
మొబైల్‌తో టాయిలెట్‌లోకి వెళ్తున్నారా? ఇది మీకోసమే!
టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి అరగంటైనా కూర్చోనిదే కొందరికి సంతృప్తి కలగదు. కాలకృత్యాలు తీసుకునే సమయంలో ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, 3-5 నిమిషాల్లోపే ఈ పని కానివ్వాలంటున్నారు. టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తుంటిపై ఒత్తిడి కలుగుతుంది. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది పైల్స్‌కు దారితీస్తుంది.
News November 14, 2024
నేడు డయాబెటిస్ డే: ఈ జాగ్రత్తలు తీసుకోండి
రక్తంలో చక్కెరల/గ్లూకోజ్‌ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, కిడ్నీ సమస్యలు రావచ్చు. తరచూ దాహం, ఎక్కువగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, పుండ్లు, చూపులో క్షీణత దీని లక్షణాలు. షుగర్ లెవెల్స్ ఎక్కువుండే ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్ తీసుకోవద్దు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సొర, కాకర, ఆకుకూరలు, జొన్న, రాగులతో చక్కెర స్థాయులు తగ్గుతాయి.