News November 20, 2024
Elections: వీరి ఆస్తులు రూ.2వేలే!
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అజయ్ భోజ్‌రాజ్, విజయ్ మనోహర్, అల్తాఫ్ సయ్యద్ తమ ఆస్తులు కేవలం రూ.2,000 అని అఫిడవిట్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పేద అభ్యర్థులుగా నిలిచారు. పరాగ్ షా(BJP) రూ.3,383 కోట్లతో రిచ్ కాండిడేట్‌గా ఉన్నారు. నిరక్షరాస్యులు 10, 5వ తరగతి 85, 8th 214, టెన్త్ 313, ఇంటర్ చదివిన వారు 422 మంది ఉన్నారు. PS: HT
Similar News
News November 20, 2024
నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News November 20, 2024
కోహ్లీ ఆట చూడాలని ఉంది: అక్తర్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.
News November 20, 2024
సెండాఫ్ సమయంలో వందేభారత్ ఎక్కొద్దు!
కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో కొడుకును రైలు ఎక్కించేందుకు వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. వందేభారత్ రైలెక్కి కొడుకు సీటు వద్ద లగేజీ పెట్టి దిగుతుండగా డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో అతను కొడుకుతో కలిసి న్యూఢిల్లీ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకు టీసీ రూ.2870 జరిమానా విధించారు. ఎవరైనా తమవారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు వందేభారత్‌లోకి ఎక్కకపోవడమే బెటర్.