News November 2, 2024
ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్(మ) పోతారం వద్ద ట్రాక్టర్-బైక్ ఢీకొని దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికంగా పలువురు రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారు. దీంతో రోడ్డుపై ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చిన బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
Similar News
News November 2, 2024
అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ.. భారీగా తరలివస్తున్న భక్తులు
TG: ఏటా దీపావళి పండుగకు HYDలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ఈ నాణేలను తయారు చేస్తారు. ఈసారి గురువారం ప్రారంభమైన కాయిన్స్ పంపిణీ రేపటి(ఆదివారం) వరకూ కొనసాగనుంది. ఈ నాణేలు లభిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రేపు సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశముంది.
News November 2, 2024
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రేపు ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
News November 2, 2024
రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు: సీఎం
AP: 10 పాలసీలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మెట్రో రైలు, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి ఏపీ అన్ని అంశాల్లోనూ ముందుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.