News July 22, 2024

హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం: గవర్నర్

image

AP: విభజన చట్టం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తగినంత పరిహారం అందలేదని అసెంబ్లీలో ప్రసంగంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలున్నాయి. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలను విభజించారు. ఫలితంగా ఉన్నత విద్యాసంస్థల కోల్పోయాం’ అని గవర్నర్ వెల్లడించారు.

Similar News

News January 24, 2025

రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని

image

AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.

News January 24, 2025

2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.

News January 24, 2025

20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్

image

TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.