News August 19, 2024

ఫుడ్‌పాయిజన్ ఘటన.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: అనకాపల్లి హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్ <<13890531>>ఘటన<<>> నేపథ్యంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలను తనిఖీ చేయాలని సూచించారు. వాటికి అనుమతులు ఉన్నాయా? సొంత భవనాలేనా? పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంది? తదితర అంశాలను చెక్ చేయాలని చెప్పారు. కాగా కలుషిత ఆహారం తిన్న ఘటనలో ఇప్పటికే నలుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు.

Similar News

News December 6, 2025

ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

image

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.

News December 6, 2025

మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

image

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.

News December 6, 2025

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎయిర్‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC12 – JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/