News March 7, 2025
GET READY: నేడు ఉదయం 11 గంటలకు..

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్‌లో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News March 28, 2026
HYD: సీతారాముల పెళ్లికి పులకించిన పుడమి!

రామరాజ్యం అంటేనే సుభిక్షం. ధర్మబద్ధమైన పాలనలో నెలకు 3 వానలతో సస్యశ్యామలమని ప్రతీతి. అదే రీతిలో శ్రీ సీతారాముల కళ్యాణం రోజు పుడమి తల్లి పులకించేలా వర్షం కురిసింది. ముక్కోటి దేవతలు అక్షింతలు జల్లినట్లు వర్షం రూపంలో కరుణించారేమో అని భక్తులు విశ్వసిస్తున్నారు. కురిసిన ప్రతి జలధారను దేవతల కరుణామృతంగా భావించిన భక్తజనం భక్తి పరవశంతో ఆస్వాదించారు. అంతా రామమయం.. జగమంతా రామమయం అని వ్యాఖ్యానిస్తున్నారు.
News March 28, 2026
4 లీటర్ల పెట్రోల్ దాచాడని 3 వారాలు జైలు శిక్ష

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన కొరతతో దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 లీటర్ల పెట్రోల్ దాచాడనే కారణంతో శ్రీలంక కోర్టు బాలసూర్య అనే వ్యక్తికి 3 వారాల జైలు శిక్ష, రూ.1,500 ఫైన్ విధించింది. అతను అక్రమంగా పెట్రోల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే తాను ఇంటి పరిసరాల్లో చెత్తను కాల్చేందుకు తెచ్చుకున్నానని నిందితుడు తెలిపారు.
News March 28, 2026
నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 గం. వరకు ఒక గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.


