News May 26, 2024

Good News: ఆరోగ్య బీమా సెటిల్‌మెంట్ కోసం ప్రభుత్వ పోర్టల్!

image

ఆరోగ్య బీమా క్లెయిమ్ సాఫీగా సాగేందుకు ఓ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఒక వారధిలా ఉపయోగపడనుంది. వచ్చే 3నెలల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 బీమా సంస్థలు, 250 ఆస్పత్రుల్ని కేంద్రం అనుసంధానించినట్లు సమాచారం.

Similar News

News January 18, 2025

నిరాశపరిచిన సింధు

image

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్‌లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

News January 18, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 18, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.28 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు
✒ ఇష: రాత్రి 7.20 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 18, 2025

విడాకుల కేసులో సాక్ష్యంగా దంపతుల వాయిస్ రికార్డింగ్స్.. కోర్టు ఏమందంటే?

image

విడాకుల కేసు విచారణలో చట్టబద్ధత, నైతికతపై సుప్రీంకోర్టులో కీలక చర్చ జరిగింది. భార్యతో జరిగిన సంభాషణలను భర్త సాక్ష్యంగా ప్రవేశపెట్టడంపై జస్టిస్ నాగరత్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇన్నేళ్లుగా భార్య మాటల్ని రికార్డ్ చేసే భర్త ఎవరుంటారు? ఈ కేసులో ఆర్టికల్-21 కింద గోప్యతా హక్కు, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్-122 వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను FEB 18కి వాయిదా వేశారు.