News June 27, 2024

KCR పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

image

TG: పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని KCR వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధం. నోటీసులకు KCR సమాధానం ఇవ్వకముందే ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టారు. ERC నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీనిపై విచారణ కమిషన్ వేయకూడదు’ అని అన్నారు.

Similar News

News September 20, 2024

ఆ రెండు రోజుల్లో తిరుమల ఘాట్ రోడ్లలో టూవీలర్స్ నిషేధం

image

AP: అక్టోబ‌ర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD వెల్లడించింది. 8న గరుడ సేవ నేపథ్యంలో 7వ తేదీ రాత్రి 9 నుంచి 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్స్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

News September 20, 2024

Learning English: Synonyms

image

✒ Gross: Improper, Rude, Coarse
✒ Happy: Pleased, Contented
✒ Hate: Despise, Loathe, Abhor
✒ Have: Acquire, Gain, Maintain
✒ Help: Aid, Assist, Succor
✒ Hide: Conceal, Shroud, Veil
✒ Hurry: Hasten, Urge, Accelerate
✒ Hurt: Distress, Afflict, Pain
✒ Idea: Thought, Concept, Notion

News September 20, 2024

బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం

image

TG: మెదక్ BJP MP రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్‌కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.