News August 13, 2025
భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిల్చోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నడపడం ప్రమాదకరం. సెల్లార్‌లోకి వరద చేరినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా మెయిన్ ఆఫ్ చేయాలి. విష జ్వరాలు రాకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’ అని చెబుతున్నారు.
Similar News
News August 13, 2025
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు: జగన్

AP: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉప ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. పోలీసులే ఏజెంట్ల ఫామ్‌లు చించేశారు. బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్లను లేకుండా చేశారు. ఇంత అన్యాయమైన ఎన్నికలు నేనెప్పుడూ చూడలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News August 13, 2025
RRBలో 1036 జాబ్స్.. ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్

దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి RRB నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాజాగా ఎగ్జామ్ డేట్స్‌ను RRB ప్రకటించింది. Sept 10-12 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి. ఎగ్జామ్‌కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
News August 13, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈనెల 18న క్యాబినెట్ భేటీలో చర్చించి CM ప్రకటించే అవకాశం ఉంది. రేపు పంచాయతీ అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. అటు ఎన్నికల నిర్వహణకు గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్సులు HYDకు వచ్చాయి. వాటిని నేడు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.