News June 1, 2024

ఏపీలో కూటమికి అత్యధిక సీట్లు: ఇండియా టీవీ CNX

image

ఏపీలో కూటమి 20 నుంచి 23 లోక్‌సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3-5, బీజేపీ 4-6, జనసేన 2 సీట్లు సాధిస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ ఒక్క సీటులోనూ నెగ్గదని పేర్కొంది.

Similar News

News January 21, 2025

Stock Markets: రేంజుబౌండ్లో కొనసాగొచ్చు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు రేంజుబౌండ్లో చలించొచ్చు. సూచీలు ఊగిసలాడే అవకాశం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. ఆరంభంలో లాభపడిన గిఫ్ట్ నిఫ్టీ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ యీల్డులు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. USDINR బలహీనత కొనసాగుతోంది. బంగారం ధర పెరిగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 21, 2025

ప్రైవేట్ సంస్థలకు డిపోలు.. ఆర్టీసీ ఉద్యోగుల్లో అలజడి

image

TG: పలు RTC డిపోలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. అద్దె బస్సులు పెరగడంతో పాటు డ్రైవర్ ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తున్న సంస్థలకు వరంగల్-2, HYD-1 డిపోలను అప్పగించగా, అక్కడి RTC బస్సులు, సిబ్బందిని వేరే డిపోలకు తరలిస్తున్నారు. త్వరలో మరిన్ని డిపోలనూ ఇలాగే అప్పగిస్తారన్న ప్రచారంతో భవిష్యత్తుపై ఉద్యోగులంతా వాపోతున్నారు.

News January 21, 2025

నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి!

image

TG: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ₹1.63 లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కోణార్క్‌లో ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు. ORR-RRR రోడ్లకు ₹45,000cr, మెట్రో విస్తరణకు ₹24,269cr, మూసీ పునరుజ్జీవ పనులకు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం ఇచ్చారు.