News March 13, 2025
హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు.
Similar News
News March 13, 2025
బేర్స్ గ్రిప్‌లోకి Nifty IT: రూ.8.4లక్షల కోట్ల నష్టం

దేశీయ ఐటీ సూచీ బేర్స్ గ్రిప్‌లోకి జారిపోయింది. 2024, DEC 4న 45,995 వద్ద NiftyIT సూచీ ప్రస్తుతం 36,271 స్థాయికి చేరింది. 62 సెషన్లలోనే ఏకంగా 10,200 pts (22%) పతనమైంది. దీంతో ఈ ఒక్క రంగంలోనే రూ.8.4లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. TCS రూ.3.79లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.1.69లక్షల కోట్లు, HCL TECH రూ.1.21లక్షల కోట్ల మేర నష్టపోయాయి. సాధారణంగా ఏ సూచీ అయినా 20% పతనమైతే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు.
News March 13, 2025
మతం మారమని బలవంతం చేసేవారు: డానిష్ కనేరియా

మైనారిటీలపై వివక్ష కారణంగానే తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నారు. పాక్ తరఫున ఆడుతున్న సమయంలో మిగిళిన వాళ్లతొ సమానంగా విలువదక్కేది కాదని, ఆప్రీది,షోయబ్ అక్తర్ తరచుగా మతం మారమని బలవంతం చేసేవారని తెలిపారు. ఇంజమామ్ మాత్రం తనకు మద్దతుగా ఉండేవారన్నారు. ఆ కారణంగానే USAలో స్థిరపడాల్సి వచ్చిందన్నారు. పాక్ తరఫున ఆడిన హిందు క్రికెటర్లలో డానిష్ కనేరియా 2వ వారు.
News March 13, 2025
విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్

AP: వైసీపీ అధినేత జగన్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన <<15734998>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ‘విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? ఒకరిపై ప్రేమ పుడితేనే మరొకరిపై మనసు విరుగుతుంది. జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది’ అని కౌంటర్ ఇచ్చారు.