News September 12, 2025

భార్యాభర్తలు మొబైల్‌ను వదిలి ఉండలేరేమో: చంద్రబాబు

image

AP: ఫోన్ల వాడకంపై CM చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. ఒకప్పుడు తాను ప్రతి ఒక్కరికీ మొబైల్ అంటే నవ్వేవారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య కాసేపైనా ఉంటారేమో గానీ సెల్‌ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారు(నవ్వుతూ). టెలికం విప్లవంపై అప్పటి PM వాజ్‌పేయీ, FM మాత్రమే నా విజన్ అర్థం చేసుకున్నారు’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.

Similar News

News September 12, 2025

నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

image

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆమె నేపాల్ తొలి మహిళా PMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్‌‌ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్‌‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలో విద్యనభ్యసించారు.

News September 12, 2025

USలో తల నరికిన ఘటన.. సంచలన విషయాలు

image

USలో భారత సంతతికి చెందిన నాగమల్లయ్యను కో-వర్కర్ మార్టినెజ్ తల నరికి <<17684402>>చంపిన<<>> విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. వాషింగ్ మెషీన్ పనిచేయట్లేదని నేరుగా చెప్పకుండా మరో ఉద్యోగినితో చెప్పించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. క్రిమినల్ నేపథ్యం ఉన్న మార్టినెజ్‌ ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి రిలీజయ్యాడు. అలాంటి వ్యక్తిని ఎలా వదిలేశారు? జాబ్ ఎందుకు ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

News September 12, 2025

క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నాం: సత్యకుమార్

image

క్యాన్సర్‌కు మంచి వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘క్యాన్సర్ కారణంగా అమ్మ, అక్కని కోల్పోయాను. 18Y+ అమ్మాయిలకు బ్రెస్ట్, 30Y+ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 2.92 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాం. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు స్త్రీలు ముందుకు రావట్లేదు’ అని తెలిపారు.