News June 24, 2024
తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం
TG: ఐదుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం హస్తం పార్టీ బలం 70కి చేరింది. తెల్లం వెంకటరావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల) పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, BRS 39 సీట్లు సాధించాయి. ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవడంతో దాని బలం 70కి పెరిగింది.
Similar News
News January 10, 2025
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత
కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 10, 2025
గర్భిణులకు సీమంతం చేసిన పవన్ కళ్యాణ్
AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పవన్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు.
News January 10, 2025
కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
TG: కలెక్టర్లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్త పథకాల విధివిధానాల ఖరారుపైనా చర్చిస్తున్నారు.