News October 8, 2025

2050 నాటికి అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్: బ్రిటన్ ఎకనామిస్ట్

image

చమురు వినియోగంలో 2050 నాటికి భారత్ అన్ని దేశాలను అధిగమిస్తుందని బ్రిటిష్ ఎకనామిస్ట్ స్పెన్సర్ డేల్ అంచనా వేశారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 12%కి పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ డిమాండ్ రోజుకు 5.4M బారెల్స్‌గా ఉండగా, 2050 నాటికి ఇది 9.1M bpdకి చేరుతుందన్నారు. అలాగే నేచురల్ గ్యాస్ వినియోగం రెట్టింపవుతుందన్నారు. కాగా ప్రస్తుతం IND మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా, వినియోగదారుగా ఉంది.

Similar News

News October 8, 2025

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం: మంత్రి ఉత్తమ్

image

TG: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘2 అలైన్‌మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈనెల 22 నాటికి ఒక దానిని ఖరారు చేస్తాం. 1st అలైన్‌మెంట్‌లో తుమ్మిడిహెట్టి-మైలారం 71.5kms గ్రావిటీ కెనాల్, 14kms టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు, 2nd దానిలో పంపింగ్ స్టేషన్‌తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉంది’ అని తెలిపారు.

News October 8, 2025

గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?

image

తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.

News October 8, 2025

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్!

image

విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్దన’ టైటిల్‌తో ఓ సినిమా తీయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 11న లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవి కిరణ్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం.