News August 23, 2024

పెట్టుబడి రూ.10 లక్షలు – లాభం రూ.4.46 కోట్లు

image

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. 2004, ఆగస్టులో మొదలైన ఈ స్కీమ్ 21.02% CAGRతో అదరగొట్టింది. 20 ఏళ్ల క్రితం ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు రూ.4.56 కోట్లు చేతికందాయి. ఇదే సమయంలో నిఫ్టీ 16.2% CAGRతో రూ.2 కోట్లే అందించింది. ఇక ఆరంభం నుంచీ నెలకు రూ.10వేలు సిప్ చేస్తే XIRR 19.41%తో ఆ విలువ రూ.2.30 కోట్లకు పెరిగేది.

Similar News

News October 25, 2025

ఆ తల్లి కన్నీటి మంటలను ఆర్పేదెవరు?

image

కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదం<<>> ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) మృతితో తల్లి వాణి ఒంటరైపోయారు. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. నెల్లూరుకు చెందిన అనూష తన బిడ్డ మన్వితను కాపాడుకోవాలని తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో కుమార్తెను గుండెలకు హత్తుకుని కాలిపోయిన దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది.

News October 25, 2025

టోల్‌ప్లాజాల వద్ద పాస్‌ల వివరాలతో బోర్డులు: NHAI

image

వాహనదారుల్లో అవగాహన, పారదర్శకత కోసం NHAI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్‌ల వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 30 రోజుల్లోపు పాస్‌ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. ఈ మేరకు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో వివరాలను ప్రదర్శించనున్నారు.

News October 25, 2025

నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

image

40ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పులు, జీవక్రియలు నెమ్మదించి చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్‌ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.