News August 4, 2024
ప్రభుత్వం ఇలా వ్యవహరించడం బాధాకరం: హరీశ్ రావు
TG: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘నిజామాబాద్(D) కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్‌లో శుక్రవారం సరైన భోజనం లేకపోవడంతో విద్యార్థులు కారం, నూనె కలిపిన అన్నంతో కడుపు నింపుకున్నారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. బిల్లులు, వేతనాల పెండింగ్ వల్లే సరైన భోజనం అందడం లేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 21, 2025
బ్యాంక్ ఖాతాదారులకు ALERT
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. KYC వివరాలను అప్‌డేట్ చేయని కస్టమర్లు జనవరి 23 నుంచి తమ ఖాతాలను ఉపయోగించలేరు. ఇందుకోసం ఓటర్, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్ బిల్లు వంటి వాటిల్లో ఏదో ఒక పత్రం సమర్పించి KYC చేయించాలి. వీటి వివరాలను పరిశీలించి బ్యాంక్ ఖాతాదారుల వివరాలను అప్‌డేట్ చేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే నేరుగా బ్రాంచ్‌లో అయినా ఇది చేయవచ్చు.
News January 21, 2025
ఇండియాలో టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన!
అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తొలిసారి ఇండియాలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో టేలర్ ప్రదర్శన ఇస్తారని సినీవర్గాలు తెలిపాయి. అత్యంత పాపులర్ సింగర్ పర్ఫార్మెన్స్ కావడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ టీమ్ చర్చలు జరిపిందని, త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నాయి.
News January 21, 2025
మహాకుంభమేళా కోసం ఓ IAS ఏం చేశారంటే?
ఓ సివిల్ సర్వెంట్ తలుచుకుంటే ఏం చేయగలరో IAS చంద్రమోహన్ గర్గ్ నిరూపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఈయన మహాకుంభమేళా నేపథ్యంలో డంప్ యార్డును అడవిలా మార్చేశారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రెండేళ్లలో యార్డులోని వ్యర్థాలను తొలగించి మియావాకీ పద్ధతిలో 1.2 లక్షల మొక్కలను నాటారు. దీంతో దుమ్ము, దూళిని పోగొట్టి గాలి నాణ్యతను పెంచిన ఈ IASను అభినందించాల్సిందే.