News August 11, 2025

ఇందులో నా తప్పులేదు: నిధి అగర్వాల్

image

AP: తాను ప్రభుత్వ వాహనంలో తిరగడంపై నెలకొన్న వివాదంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. ‘భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇది జరిగింది. స్థానిక నిర్వాహకులు నాకోసం కారును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు. ఇందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వమే నాకు ఈ వాహన సదుపాయం కల్పించిందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. అభిమానులు నమ్మవద్దు’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News August 11, 2025

ఆక్వా రంగం నష్టపోకుండా చర్యలు: అచ్చెన్నాయుడు

image

AP: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపై పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగానికి <<17357620>>నష్టం <<>>లేకుండా అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎల్లుండి ఆక్వా రంగంపై సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

News August 11, 2025

క్రైం న్యూస్ రౌండప్

image

* హైదరాబాద్ ORRపై వాహనం ఢీకొని ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
* విశాఖ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం. బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
* వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం. కార్మికుడి మృతి

News August 11, 2025

సైబర్ నేరగాళ్లకు షాక్.. వెంటనే సిమ్ బ్లాక్

image

సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇవ్వనుంది. అనుమానితుల లొకేషన్లు, బ్యాంకు, టెలికాం వివరాలను తక్షణమే అన్ని పీఎస్‌లకు పంపేలా చర్యలు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. త్వరలోనే TGలో సెమినార్ నిర్వహించనుంది.