News April 15, 2024
కళ్యాణోత్సవం లైవ్‌కు అనుమతివ్వండి: మంత్రి సురేఖ
TG: భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు. కళ్యాణం లైవ్‌కు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. కాగా, ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News November 17, 2024
నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్
నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్న ఆమెను చెన్నై పోలీసులు <<14631162>>హైదరాబాద్<<>>లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News November 17, 2024
వారికి ప్రజా సంక్షేమం పట్టదు: సీతక్క
TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2024
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!
97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.