News July 24, 2024
LTCG Tax: హైదరాబాద్ రియల్టీకి ఊరట!
స్థిరాస్తిపై LTCG పన్ను 12.5 శాతానికి తగ్గించడం, ఇండెక్సేషన్ రద్దు వల్ల సామాన్యుడికి మేలేనని సమాచారం. సొంతింటి కల నెరవేర్చుకొనే ప్రజలపై ప్రభావం తక్కువేనని CLSA తెలిపింది. పాత ఇంటిని అమ్మి కొత్త ఇల్లు కొనేవారికి LTCG వర్తించదు. హైదరాబాద్, బెంగళూరు, పుణేలో ఈ ధోరణి ఎక్కువ. పెట్టుబడి ఉద్దేశంతో కొనుగోలు చేసే ఢిల్లీ, ముంబై మార్కెట్లో మాత్రం పన్ను మోత మోగనుంది. స్వల్పకాల పెట్టుబడైతే భారం మరీ ఎక్కువ.
Similar News
News January 27, 2025
GBSతో మహారాష్ట్రలో తొలి మరణం
గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జీబీఎస్ అనేది అరుదైన నరాల సంబంధిత అనారోగ్యం. ఇది తలెత్తిన వారిలో సొంత రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.
News January 27, 2025
ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు
మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.
News January 27, 2025
ఆర్టీసీలో సమ్మె సైరన్
TG: ఆర్టీసీలో ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనుంది. కాగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.