News July 9, 2024

రష్యా ఆర్మీ నుంచి భారతీయులకు విముక్తి?

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో పలువురు భారతీయులను రష్యా తన ఆర్మీలో వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోదీతో చర్చల అనంతరం తమ ఆర్మీలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి కలిగించాలని రష్యా ప్రెసిడెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. అటు ఈ యుద్ధంలో ఇప్పటికే ఇద్దరు భారతీయులు మరణించగా, భారీ జీతాలిస్తామని చెప్పి తమను ఆర్మీలో చేర్పించారని కొందరు ఆరోపిస్తున్నారు.

News July 9, 2024

‘టిల్లు క్యూబ్’లో తెలుగు హీరోయిన్?

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘టిల్లు’ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో తర్వాతి మూవీ ‘టిల్లూ క్యూబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ‘ట్యాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో మూవీ టీమ్ పడిందట. ‘టిల్లూ స్క్వేర్’లో ఈ అమ్మడు చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంకకే మూవీ యూనిట్ ఓట్ వేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News July 9, 2024

పెరిగిపోతున్న ‘రోస్టింగ్’ కల్చర్

image

సోషల్ మీడియాలో ఈ మధ్య రోస్టింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎవరైనా పాపులారిటీ సాధిస్తుంటే వారిలోని శారీరక లోపాలను ఎత్తి చూపుతూ, బూతులతో టార్గెట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా అసభ్యకర కామెంట్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. కాగా రోస్టింగ్‌ కోసం కొందరు ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేస్తున్నారు. వీటికి కొందరు అమాయకులు సైతం బలైపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News July 9, 2024

తలొగ్గని రేవంత్ సర్కారు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: డీఎస్సీ పరీక్షల తేదీ మార్పు విషయంలో అభ్యర్థుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గలేదు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు రోడ్డెక్కారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంటే.. 25వేలకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రిపరేషన్ కోసం సమయం కావాలంటున్నారు.

News July 9, 2024

కుక్క గోళ్లతో గీరితే టీకా వేయించుకోవాలా?

image

కుక్క గోళ్లతో గీరితే టీకా వేయించుకోవాలా? అవసరం లేదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే కుక్క గోళ్లతో గీరినా టీకా వేయించుకోవాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు. కుక్కలు తమ కాళ్లను నోట్లో పెట్టుకున్నప్పుడు గోళ్లలోకి లాలాజలం వెళుతుందట. అలా రేబిస్ కారక వైరస్ గోళ్లలోకి వెళ్లి తద్వారా మన చర్మంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
> SHARE

News July 9, 2024

ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.19వేల కోట్లు!

image

TG: తుది దశలో ఉన్న పలు ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టు పెంచేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర 2024-25 బడ్జెట్‌లో 19 ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.19,287 కోట్లు కేటాయించనుంది. తద్వారా 6.83లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా బడ్జెట్ కేటాయింపులపై నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రులు కొన్ని రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

News July 9, 2024

YSR వారసత్వం కోసం పోటాపోటీ!

image

తండ్రి రాజకీయ వారసత్వం కోసం జగన్, షర్మిల పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ సహా ఢిల్లీ, కర్ణాటక ప్రముఖులను షర్మిల తీసుకొచ్చారు. దీని ద్వారా అసలైన వారసురాలిని తానేనని చెప్పుకునేందుకు షర్మిల ప్రయత్నించారు. మరోవైపు తండ్రి బాటలోనే సంక్షేమానికి పెద్దపీట వేశానని జగన్ చెప్పుకుంటున్నారు.

News July 9, 2024

SAD: అమర జవాన్ భార్యపైనా ట్రోలింగ్

image

సోషల్ మీడియా భూతం అమర జవాన్ల కుటుంబాలనూ వదలట్లేదు. దేశం కోసం ప్రాణమిచ్చిన కెప్టెన్ అన్షూమన్ సింగ్‌కు ‘కీర్తి చక్ర’ ప్రకటించి, ఆ అవార్డును ఆయన సతీమణి స్మృతికి రాష్ట్రపతి ఇటీవల అందించారు. కాగా ఆ వీడియోపైనా కొందరు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అహ్మద్‌ అనే వ్యక్తిపై NCW కేసు నమోదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ విన్పిస్తోంది.

News July 9, 2024

గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు: హైకోర్టు

image

TG: రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. అది యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పేర్కొంది. ఉద్యోగి లేదా వారసులకు గ్రాట్యుటీ ఇవ్వాలని చట్టంలో ఉందని తేల్చి చెప్పింది. రూ.3.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెరిగిన గ్రాట్యుటీ సీలింగ్‌కు ఉద్యోగులు అర్హులంటూ PF అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ECIL దాఖలు చేసిన అప్పీళ్లపై కోర్టు ఇలా స్పందించింది.

News July 9, 2024

కాలకృత్యాల కోసం ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్తే..

image

TG: కాలకృత్యాల కోసం ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తికి అటవీశాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేశారు. అయితే నిన్న మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కాలకృత్యాల కోసం అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లాడు. ఇది గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది అతడిని పట్టుకుని రూ.2వేల ఫైన్ వేశారు.