News July 6, 2024

జులై 6: చరిత్రలో ఈరోజు

image

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
ప్రపంచ రేబీస్ దినోత్సవం

News July 6, 2024

బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్

image

బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాచెల్ రీవ్స్‌ను తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు నూతన PM స్టార్మర్ తెలిపారు. 45 ఏళ్ల రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో ఎకానమిస్ట్‌గా పనిచేశారు. 2010లో ఆమె తొలిసారి లేబర్ పార్టీ నుంచి MPగా ఎన్నికయ్యారు. ఆర్థిక వృద్ధే లేబర్ పార్టీ ప్రధాన మిషన్ అని ఆమె పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన స్టార్మర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News July 6, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 06, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:26 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:47 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2024

టీ20 WC నెగ్గడంలో రోహిత్‌ది కీలక పాత్ర: గవాస్కర్

image

టీ20 WC టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభ తనను ఆకట్టుకుందని మాజీ ప్లేయర్ గవాస్కర్ అన్నారు. ‘జట్టు విజయంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బౌలింగ్‌లో బుమ్రా, బ్యాటింగ్‌లో కోహ్లీ చాంపియన్స్. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన రోహిత్ ప్రధాన పాత్రధారి. క్లిష్ట పరిస్థితుల్లో నిస్పృహను దరిచేరనీయకుండా సమర్థంగా వ్యవహరించి కప్ నెగ్గేందుకు కారణమయ్యారు’ అని కొనియాడారు.

News July 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2024

7 మండలాలు తిరిగివ్వాలని తెలంగాణ డిమాండ్

image

TG: విభజన చట్టంలోని అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో తెలంగాణ పలు ప్రధాన డిమాండ్‌లను ప్రస్తావించనుంది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో విలీనం చేసుకున్న ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని ప్రతిపాదించనుంది. టీటీడీలో 42.58 శాతం వాటా, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో వాటా ఇవ్వాలని అడగనుంది. అలాగే సముద్ర తీరప్రాంతలోనూ వాటా ఇవ్వాలని కోరనుంది.

News July 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 06, శనివారం
ఆషాఢ శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామున 03:56 గంటలకు
పునర్వసు: తెల్లవారుజామున 05:09 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 05:34 -07:17 గంటల వరకు
రాహుకాలం: ఉదయం 9.00- 10.30 గంటల వరకు

News July 6, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
* సమస్యల పరిష్కారానికి రేవంత్‌తో చర్చిస్తా: CBN
* AP:స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోండి: పవన్
* AP: ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక
* ఆగస్టు 11 నుంచి నీట్-పీజీ పరీక్ష
* బ్రిటన్‌లో రిషి సునాక్‌కు షాక్.. లేబర్ పార్టీ విజయం

News July 5, 2024

రేపు వీరందరికీ డెబ్యూ మ్యాచ్?

image

జింబాబ్వేతో రేపు జరగనున్న తొలి టీ20లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఆయనతోపాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సాయి సుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా కూడా తమ తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి టీ20 రేపు, రెండో టీ20 ఈ నెల 7న, మూడో మ్యాచ్ 10న, నాలుగో టీ20 13న, చివరిది 14న జరగనుంది. ఈ మ్యాచులన్నీ హరారే వేదికగా జరగనున్నాయి.