News July 5, 2024

కుమారుడితో హార్దిక్ పాండ్య.. పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య T20WC విజయాన్ని తన కుమారుడు అగస్త్యతో కలిసి మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు. వరల్డ్ కప్ మెడల్‌ను కుమారుడికి వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. ‘నా నంబర్ 1 నువ్వే. నేను చేసే ప్రతిదీ నీకోసమే. ఏదైనా చేస్తా కూడా’ అంటూ హార్దిక్ పోస్టు పెట్టారు. కానీ భార్య నటాషా మాత్రం ఫొటోల్లో ఎక్కడా కనిపించలేదు.

News July 5, 2024

కేశవరావు రాజీనామా ఆమోదించిన ఛైర్మన్

image

TG: కే కేశవరావు రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయిందని సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. కాగా ఇటీవల కేశవరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. నిన్న రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు అందించగా ఒక్క రోజులోనే ఆమోదించారు.

News July 5, 2024

కాటేసిన పామును కొరికి చంపిన వ్యక్తి

image

తనను కాటేసిన పామును వ్యక్తి కొరికి చంపిన ఘటన బిహార్ రాజౌలీలో జరిగింది. రైల్వే లైన్ పని చేస్తున్న కార్మికుడు సంతోష్‌ను పాము కరిచింది. గమనించిన అతడు దాన్ని పట్టుకొని మూడుసార్లు కొరకడంతో అది చనిపోయింది. అధికారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే కరిచిన పామును తిరిగి కొరికితే విషం విరుగుడు అవుతుందని తమ ఊరిలో నమ్ముతారని అతడు చెప్పడం గమనార్హం.

News July 5, 2024

‘నీట్’పై ఎన్టీఏదీ అదే మాట

image

నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలన్న పిటిషన్లకు వ్యతిరేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పేపర్ లీకేజీ కేవలం పట్నా, గోద్రా సెంటర్లలోనే జరిగిందని, దీనికి పరీక్ష మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతకుముందు కేంద్రం కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియపర్చింది.

News July 5, 2024

జూన్‌లో కొత్తగా 42లక్షల డీమ్యాట్ అకౌంట్లు

image

జూన్‌లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 42.4లక్షల డీమ్యాట్ అకౌంట్లు నమోదయ్యాయి. ఓ నెలలో నలభై లక్షలకుపైగా అకౌంట్లు క్రియేట్ అవడం ఇది నాలుగోసారి. గతంలో 2023 డిసెంబరు సహా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ స్థాయిలో అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇక మొత్తంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2కోట్లకు చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్లు రాణిస్తుండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

News July 5, 2024

ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థానీ అమృత్‌పాల్

image

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు టెర్రర్ ఫండింగ్ కేసులో జైలుకెళ్లిన కశ్మీరీ నేత ఇంజనీర్ రషీద్ కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి అమృత్‌పాల్, బారాముల్లా స్థానం నుంచి రషీద్ ఎంపీలుగా గెలుపొందారు. కానీ వీరు జైల్లో ఉండటంతో మిగతా ఎంపీలతో ప్రమాణం చేయలేకపోయారు. ఇప్పుడు పెరోల్‌పై పార్లమెంట్‌కు వచ్చి ప్రమాణం చేశారు.

News July 5, 2024

స్మగ్లింగ్‌‌ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోండి: పవన్

image

AP: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్మగ్లింగ్‌ను నియంత్రించేలా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి శేషాచలం అడవిలో దుంగలు ఎక్కడ దాచి పెట్టారో గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్లకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న వారితో పాటు వాళ్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

News July 5, 2024

టీచర్ ట్రాన్స్‌ఫర్.. స్కూల్ మారిన 133 మంది స్టూడెంట్స్!

image

TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.

News July 5, 2024

ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర బొనాంజా

image

ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర సర్కార్ రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్‌నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.

News July 5, 2024

MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.