News July 5, 2024

టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్, డిప్యూటీ మేయర్

image

AP: చిత్తూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 46 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ప్రస్తుత చేరికలతో సంఖ్యా బలం మారుతోంది.

News July 5, 2024

నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

image

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిప్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

News July 5, 2024

బ్లాక్ బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రాబోతోంది

image

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ‘బింబిసార’ సినిమా గురించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌ ఉంటుందని ప్రకటించారు. బింబిసారుడి కంటే ముందు త్రిగర్తలా రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఏం జరిగిందనేది ఇందులో చూపించనున్నట్టు వెల్లడించారు. ‘బింబిసార’ను మల్లిడి వశిష్ఠ తెరకెక్కించగా ప్రీక్వెల్‌కు అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు.

News July 5, 2024

8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: సోమువీర్రాజు

image

AP: రాజమండ్రి వేదికగా ఈ నెల 8న BJP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత సోము వీర్రాజు వెల్లడించారు. పార్టీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 2,250 మంది నేతలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం దందాను బయటపెట్టిన మంత్రి నాదెండ్లను అభినందించారు.

News July 5, 2024

BEAUTIFUL PHOTO: రజనీతో మోహన్ బాబు

image

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో విమానంలో దిగిన ఫొటోను డైలాగ్ కింగ్ మోహన్ బాబు ట్విటర్‌లో పంచుకున్నారు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం’ అని క్యాప్షన్ ఇచ్చారు. లోకేశ్‌తో తీసే సినిమా షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్‌కు వచ్చారు. అదే సమయంలో చెన్నైలో జరిగిన వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్‌కు హాజరై మోహన్ బాబు కూడా HYDకి వచ్చారు. వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణించడంతో ఇలా ఫొటో తీసుకున్నారు.

News July 5, 2024

‘ఎక్స్‌ట్రీమ్’ డెలివరీ సేవల్ని నిలిపేసిన జొమాటో?

image

గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ‘ఎక్స్‌ట్రీమ్’ సేవల్ని జొమాటో నిలిపేసినట్లు సమాచారం. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. డిమాండ్ లేని కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తొలగించింది. అయితే దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జొమాటో క్రియాశీలంగా ఉన్న నగరాల్లో ఆహార డెలివరీ ఏజెంట్లతోనే చిన్న ప్యాకేజీలను డెలివరీ చేసేందుకు ఎక్స్‌ట్రీమ్‌ను సంస్థ ప్రారంభించింది.

News July 5, 2024

క్రెడిట్ కార్డు పేరుతో మోసం.. జాగ్రత్త: TG పోలీస్

image

క్రెడిట్ కార్డు పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TG పోలీసులు సూచిస్తున్నారు. అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డు మంజూరు అయినట్లు, ఆ కార్డుతో చెల్లింపులు జరిగినట్లు సైబర్ నేరగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకపోతే అరెస్టు అవుతారని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా HYDలో ఓ మహిళా ఉద్యోగి ఇదే తరహాలో మోసపోయారని ట్వీట్ చేశారు.

News July 5, 2024

ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!

image

జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్‌లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.

News July 5, 2024

అనంత్ అంబానీ సంగీత్‌లో సల్మాన్, రణ్‌వీర్ డాన్సులు

image

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత్ కార్యక్రమం ఈరోజు రాత్రి ముంబైలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం గడచిన వారం రోజులుగా వారు రిహార్సల్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ సైతం ఈ కార్యక్రమంలో పాడేందుకు భారత్‌కు చేరుకున్నారు.

News July 5, 2024

రేపు పులివెందులకు వైఎస్ జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన.. 2 రోజులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.