News July 4, 2024

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో రోహిత్, బుమ్రా

image

ఈ ఏడాది జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాతో పాటు అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ ఈ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు. టీ20 WCలో గుర్బాజ్ 281 రన్స్‌తో (124SR) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఇదే టోర్నీలో రోహిత్ శర్మ 257 రన్స్‌తో(156SR), బుమ్రా 15 వికెట్లతో రాణించి భారత్‌కు WC రావడంలో కీలక పాత్ర పోషించారు.

News July 4, 2024

ITIR ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరాం: భట్టి

image

TG: రాష్ట్ర ప్రయోజనాల కోసమే PM మోదీని CM రేవంత్‌, తాను కలిసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మోదీతో భేటీ అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు, ITIR ప్రాజెక్టు పునరుద్ధరణ, జిల్లాకొక నవోదయ స్కూల్, IIM మంజూరుపై PMకి వినతిపత్రం అందజేశాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కోరాం’ అని వెల్లడించారు.

News July 4, 2024

జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూశారు: హోంమంత్రి అనిత

image

AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.

News July 4, 2024

మియాపూర్ అత్యాచార ఘటనపై NCW సీరియస్

image

హైదరాబాద్‌లోని మియాపూర్‌ అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర డీజీపీకి ఛైర్‌పర్సన్ లేఖ రాశారు. మహిళపై ఆమె సహోద్యోగులు చేసిన సామూహిక అత్యాచారాన్ని కమిషన్ తీవ్రంగా ఖండించింది. బాధితురాలికి పరిహారం, ఉచిత వైద్యం అందించాలని ఆదేశించింది.

News July 4, 2024

కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం

image

TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినట్లు ఢిల్లీ పర్యటన సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

News July 4, 2024

తొలిసారి 80వేల మార్క్‌తో ముగిసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి. ఆరంభంలో ఉన్న జోరు చివరి దాకా కొనసాగకున్నా సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిసారి 80వేల మార్క్‌లో ముగిసింది. 62 పాయింట్లు లాభపడిన సూచీ 80,049 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 24,302 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

News July 4, 2024

వరల్డ్ కప్ విజేతలతో ప్రధానులు

image

టీ20 వరల్డ్ కప్‌-2024లో గెలిచి విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వరల్డ్ కప్‌ విజేతలతో అప్పటి ప్రధానులు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. 1983లో తొలి ODI వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో దిగారు. 2007లో T20 WC గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు గత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది.

News July 4, 2024

హాథ్రస్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

హాథ్రస్ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు సత్సంగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హాథ్రస్ జిల్లాలోని రతిభాన్‌పూర్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. 80 వేల మందికి అనుమతి తీసుకోగా 2.50 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.

News July 4, 2024

కోహ్లీ, రోహిత్‌కు BCCI స్పెషల్ ట్రీట్!

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. టీమ్ఇండియా ప్లేయర్లు ఢిల్లీ నుంచి ముంబై‌కి ప్రయాణించే విస్తారా విమానానికి వారి జెర్సీ నంబర్లు (కోహ్లీ 18, రోహిత్ 45) ఉండేలా ‘UK1845’ నంబర్ కేటాయించింది. ఇలా ఈ విమానాన్ని వారిద్దరికి అంకితం చేసింది. కాగా ముంబైకి చేరుకున్న తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఓపెన్ బస్ పరేడ్‌లో పాల్గొననున్నారు.

News July 4, 2024

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹లక్షకు పెంపు?

image

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో వేతనజీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50వేలు ఉండగా ఆ మొత్తాన్ని ₹లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.