News July 3, 2024

రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న ప్రభాస్ ‘కల్కి’

image

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ వసూళ్ల పరంపర కొనసాగుతోంది. 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘జైలర్’, సల్మాన్ ‘సుల్తాన్’ లైఫ్‌టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఇంకా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని రికార్డుల్ని సృష్టించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ రికార్డుల్నీ కల్కి దాటేయడం విశేషం.

News July 3, 2024

అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ ఔట్?

image

అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన తాజా డిబేట్‌లోనూ బైడెన్ తేలిపోయారు. దీంతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, తప్పుకోవడమే మేలని బైడెన్ భావిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనాన్ని శ్వేతసౌధం ఖండించింది.

News July 3, 2024

దర్శన్ ఖైదీ నంబర్‌తో చిన్నారి ఫొటోషూట్.. కేసు నమోదు

image

తన ఫ్యాన్‌ను చిత్రహింసలు పెట్టి చంపారనే ఆరోపణలపై జైలుకెళ్లారు కన్నడ హీరో దర్శన్. అయినప్పటికీ కర్ణాటకలో అతడి ఫ్యాన్స్ అభిమానం వెర్రితలలు వేస్తూనే ఉంది. తాజాగా ఓ జంట తమ బిడ్డకు ఖైదీ నంబర్ 6106 (జైల్లో దర్శన్‌కు కేటాయించిన నంబర్) అని రాసి ఉన్న వైట్ డ్రస్ వేసి ఫొటో షూట్ చేశారు. ఇది వైరల్ కావడంతో బాలల హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. కాగా.. చాలామంది ఫ్యాన్స్ 6106ను టాటూగా వేయించుకుంటుండటం గమనార్హం.

News July 3, 2024

BREAKING: APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యారు. పదవీ విరమణకు రెండేళ్ల ముందే సవాంగ్ రాజీనామా చేశారు.

News July 3, 2024

హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా గత నెల 23న సోనాక్షి, జహీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన వీరి వివాహానికి సినీతారలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున హాజరయ్యారు.

News July 3, 2024

రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్.. మీకు మెసేజ్ వచ్చిందా?

image

NEET సహా ఇతర పరీక్ష పేపర్ల లీకేజీలను నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU తదితర స్టూడెంట్ యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లు రేపు బంద్ అంటూ పేరెంట్స్, స్టూడెంట్లకు మెసేజ్‌లు పంపాయి. మరి స్కూల్ బంద్ అంటూ మీకు మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News July 3, 2024

3 నెలల్లో 1.28 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

image

AP: వచ్చే 3 నెలల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇందుకోసం రూ.2,520 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.

News July 3, 2024

ICC ట్రోఫీ: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

image

ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరోసారి దాయాదుల సమరం జరిగే అవకాశం ఉంది. 2025 మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌పై ICC, PCB వేచి చూస్తున్నా BCCI ఇంకా తన నిర్ణయం వెల్లడించటం లేదని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Aలో ఇండియా, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గాన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

News July 3, 2024

సూరజ్‌ పాల్ అలియాస్ భోలేబాబా

image

భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్. UPలోని బహదూర్‌లో పుట్టిన అతడు 18 ఏళ్లు కానిస్టేబుల్‌గా పనిచేశాడు. తర్వాత VRS తీసుకొని ఆధ్యాత్మిక బాట పట్టాడు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో 1997లో అరెస్టై జైలుకెళ్లాడు. తర్వాత బయటికొచ్చి తన పేరును సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. అతడి సభలకు జనం తండోపతండాలుగా వస్తుంటారు. కరోనా సమయంలో ఓ సభకు 50మందికే అనుమతి ఇస్తే 50వేల మంది రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

News July 3, 2024

ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పైపోయింది: YCP మాజీ MLA

image

AP: ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడం వల్లే ఓటమి పాలయ్యామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పై పోయిందని చెప్పారు. ‘ఎవరైనా అడిగితేనే మేలు చేయాలి. అడగనిదే ఇస్తే దేనికీ విలువ ఉండదు. అదే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జనం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం కూడా తప్పిదమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.