News July 3, 2024

విషాదం నుంచి విజయానికి!

image

కేరళకు చెందిన జాతీయ స్థాయి స్విమ్మర్ షాన్ ఎస్ ఎన్నో విషాదాలను తట్టుకొని విజయాన్ని ముద్దాడారు. 2013లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో అతని జీవితం తలకిందులైంది. అయినా క్రీడల పట్ల తనకున్న అభిరుచిని కోల్పోలేదు. కాళ్లు లేకపోయినా కష్టపడి స్విమ్మింగ్ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిరోహించేందుకు సిద్ధమవుతూ ఎందరికో ప్రేరణనిస్తున్నారు.

News July 3, 2024

త్వరలో ప్రసారభారతి ఓటీటీ.. ప్రైవేట్ కంపెనీల్లో ఆందోళన?

image

కేంద్రానికి చెందిన ప్రసారభారతి సొంత ఓటీటీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వేళ ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఓటీటీలో స్పోర్ట్స్ ఫ్రీగా లైవ్ ప్రసారం చేస్తే తాము భారీగా నష్టపోతామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే స్పోర్ట్స్ ప్రసారంపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా వార్తలు, వినోదం, క్రీడలు మొదలైన విభాగాలపై ప్రసారభారతి ఓటీటీని తీసుకురానున్నట్లు సమాచారం.

News July 3, 2024

విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

image

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలైనా విధులకు హాజరుకాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ బుక్‌ను పరిశీలించిన ఆయన, ప్రతి ఉద్యోగి విధిగా సమయానికి రావాలని ఆదేశించారు.

News July 3, 2024

హాథ్రస్ విషాదం.. కాల్వలో పడ్డవాళ్లని తొక్కుకుంటూ వెళ్లారు

image

UPలోని హాథ్రస్ <<13553522>>తొక్కిసలాట<<>>లో 121 మంది భక్తులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో అక్కడి భయానక దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘సత్సంగ్ అయిపోగానే ఒక్కసారిగా అందరూ బయటకొచ్చారు. తోపులాటలో ప్రాంగణం బయట రోడ్డు కింద ఉన్న మురికి కాల్వలో చాలా మంది పడ్డారు. వాళ్లను జనం తొక్కుకుంటూ వెళ్లారు. కింద ఉన్న వాళ్లు ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయారు’ అని తెలిపారు.

News July 3, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం కేశవరావు(కేకే) ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో కేకే కూతురు విజయలక్ష్మీ హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

News July 3, 2024

BREAKING: కవిత కస్టడీ పొడిగింపు

image

TG: BRS ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ కేసులో ఇవాళ్టితో ఆమె కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పొడిగించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు.

News July 3, 2024

121 మంది మృతి.. భోలే బాబాపై నో కేస్!

image

హాథ్రస్‌లో భోలే బాబా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాగా అందులో భోలే బాబా పేరును ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్‌పై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారట. సభకు 80వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారని FIRలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

News July 3, 2024

BJPకి ఆ సిద్ధాంతాలు తెలియడం లేదు: రాహుల్ గాంధీ

image

హింసను, విద్వేషాన్ని వ్యాపింపజేసే బీజేపీకి హిందూధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలు తెలియడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడిని పిరికిపంద చర్య పేర్కొన్నారు. ఈ హింసాత్మక దాడి బీజేపీ, సంఘ్ పరివార్‌పై తన అభిప్రాయాన్ని బలపరుస్తుందని Xలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని, ఆ రాష్ట్రంలో INDIA కూటమి గెలుస్తుందని మరోసారి చెప్పారు.

News July 3, 2024

దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు: హీరో విజయ్

image

నీట్‌లో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని TVK చీఫ్, నటుడు విజయ్ అన్నారు. ‘ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు. TN ప్రభుత్వం నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ పాస్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి నా విజ్ఞప్తి. విద్యను ఉమ్మడి(కేంద్రం, రాష్ట్రం) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలి’ అని పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News July 3, 2024

హాథ్రస్ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్

image

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 121 మంది మరణించగా మరో 20 మందిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.