News June 30, 2024

కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

TG: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనానికి కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. CM రేవంత్ ఆదేశాలతో మార్చి 6న కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్‌పై అధికారాలు GHMCకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంది.

News June 30, 2024

ISS కూల్చివేతకు రూ.7000 కోట్లు!

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఇది భూమికి 400km ఎత్తులో పరిభ్రమిస్తుంటుంది. US, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.

News June 30, 2024

జూన్ 30: చరిత్రలో ఈరోజు

image

1928: నటుడు జె.వి. సోమయాజులు జననం
1948: నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ జననం
1982: హీరో అల్లరి నరేష్ జననం
1969: శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య జననం
1917: భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం
1984: ప్రముఖ తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు మరణం
1988: హాస్యనటుడు సుత్తి వీరభద్ర రావు మరణం
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం.

News June 30, 2024

టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై

image

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కోహ్లీ సైతం టీ20Iలకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. వరల్ట్ కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించే వాడినని వ్యాఖ్యానించారు.

News June 30, 2024

భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్

image

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందలు తెలియజేశారు. భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని AP సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ కలను రోహిత్ సేన సాకారం చేసిందన్నారు. క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌కు ఎదురు లేదని మరోసారి నిరూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

News June 30, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 30, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:45 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 30, 2024

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి అభినందనలు

image

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని కొనియాడారు. ఇది అసాధారణ విజయమని.. జట్టుని చూసి దేశం గర్విస్తోందని అన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయం రోహిత్ నాయకత్వానికి నిదర్శమని వ్యాఖ్యానించారు.

News June 30, 2024

ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఉందా?: కేంద్ర మంత్రి

image

బిహార్‌లో వరుసగా <<13531487>>బ్రిడ్జి<<>>లు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మీడియాతో అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఎందుకు ఇలా జరుగుతోందని ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఏమైనా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈ ఘటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

News June 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 30, 2024

విశ్వవిజేతగా భారత్.. ఎమోషనల్ మూమెంట్స్

image

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ టీ20 WCను ముద్దాడింది. ఆ అపురూప క్షణాల్లో భారత ఆటగాళ్లంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. వారిని చూస్తూ కోట్లాది భారతీయుల కళ్లు చెమర్చాయి. అభిమానులు జయజయధ్వానాలతో స్టేడియం మార్మోగగా.. వారికి రోహిత్ శర్మ అభివాదం చేస్తూ ఘన విజయాన్ని దేశానికి అంకితమిచ్చారు. భావోద్వేగం, ఆనందం, ఉల్లాసం అంటూ ఐసీసీ ఆ ఫొటోలను Xలో పోస్ట్ చేసింది.