News June 28, 2024

ఘోరం.. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయింది

image

మహిళలు ఒళ్లు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ (అన్‌సర్టిఫైడ్) వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికే ఇంట్రాఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందన్నారు.

News June 28, 2024

ఇన్‌స్టా బయోలో సెకండ్ బర్త్ డే యాడ్ చేసిన సుస్మితా

image

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పులు చేశారు. తాను 2023 ఫిబ్రవరి 27న రెండో సారి జన్మించినట్లు బయోలో జోడించారు. ఈ ఆసక్తికర విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, ఆ తేదీన ఆమె గుండెపోటుకు గురై యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స రోజు ఆమె మరోసారి పుట్టారనేది బయో సారాంశం అని సినీవర్గాలు తెలిపాయి.

News June 28, 2024

విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ

image

డిప్యూటీ NSA విక్రమ్ మిస్రీని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న వినయ్ క్వాట్రా పదవీ కాలం జులై 14తో ముగియనుంది. జులై 15న విక్రమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1989 బ్యాచ్‌ IFS అధికారి అయిన ఈయన గతంలో చైనా రాయబారిగా పనిచేశారు. గల్వాన్ ఘర్షణ జరిగినప్పుడు చైనాతో కమ్యూనికేషన్ కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు.

News June 28, 2024

పోలవరం అనుమతులన్నీ తెచ్చింది వైఎస్సారే: అంబటి

image

AP: పోలవరం ప్రాజెక్టు విషయంలో CM చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘తానే ఏడు గ్రామాలను APలో విలీనం చేశారని CBN గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రాజెక్టుకు 2005 నుంచి క్లిష్టమైన అనుమతులన్నీ వైఎస్సారే తెచ్చారు. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస ప్రణాళిక, పాపికొండల వన్యప్రాణ సంరక్షణ కేంద్రం మళ్లింపు లాంటి అనుమతులు తీసుకొచ్చారు’ అని గుర్తు చేశారు.

News June 28, 2024

కరోనా క్లిష్టకాలంలోనూ పోలవరం పనులు ఆగలేదు: అంబటి రాంబాబు

image

AP: YCP ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తప్పూ చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కరోనా క్లిష్టకాలంలోనూ వేగంగా పనులు చేశామన్నారు. 1995 నుంచి 2004 వరకు CMగా ఉండి, కేంద్రంలో చక్రం తిప్పిన CBN పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పోలవరాన్ని YSR ప్రారంభించారని గుర్తు చేశారు.

News June 28, 2024

రెండు నెలల ద్రవ్యలోటు @ ₹50వేలకోట్లు

image

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో (APR-MAY) ద్రవ్యలోటు ₹50,615కోట్లుగా నిలిచింది. ఇది ఈ ఏడాదికి కేంద్రం వేసిన అంచనాలో 3శాతం. కాగా గత ఏడాది ఇదే సమయానికి ఈ మొత్తం 11.8%గా ఉంది. ఖర్చు కంటే కేంద్రానికి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వెల్లడించింది. ₹90,923Cr ఆర్జించినట్లు తెలిపింది. ట్యాక్స్ రెవెన్యూ, RBI డివిడెండ్‌తో రెవెన్యూ రిసీట్స్ 19%కు చేరాయని పేర్కొంది.

News June 28, 2024

BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు అవసరంలేదు: సీఎం

image

TG: రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని చెప్పారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.

News June 28, 2024

వాళ్ల గురించి నాకు బాధలేదు: KCR

image

TG: పార్టీని వీడి దొంగలతో కలిసినోళ్ల గురించి తనకు బాధ లేదని KCR వ్యాఖ్యానించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కనా? పార్టీనే నాయకులను తయారు చేస్తుంది. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తాం. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం’ అని గులాబీ దళపతి వ్యాఖ్యానించారు.

News June 28, 2024

PSU స్టాక్స్‌ను విక్రయించనున్న కేంద్రం?

image

రక్షణ, రైల్వే, ఎరువుల రంగాల్లోని పీఎస్‌యూ షేర్లలో కొంతభాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మజగాన్ డాక్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (IRFC), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఒక్క IRFC నుంచే కేంద్రానికి ₹7600 కోట్లు రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మి కేంద్రం ₹50వేల కోట్లు రాబట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News June 28, 2024

భద్రత పెంచాలని పెద్దిరెడ్డి, మిథున్‌ పిటిషన్.. విచారణ జులై 8కి వాయిదా

image

AP: తమకు భద్రత పెంచాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రి కావడంతో 5+5 భద్రత ఉండేదని, ఇప్పుడు 1+1 సెక్యూరిటీ కల్పించినట్లు ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేశారు.