News June 28, 2024

పరీక్షల్లో సంస్కరణలకు కమిటీ.. మీ సలహాలు ఇవ్వండి: కేంద్రం

image

పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు, NTA ప్రక్షాళన కోసం కేంద్రం ఓ ఉన్నతస్థాయి <<13490528>>కమిటీని<<>> ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.‌రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. జులై 7 వరకు వాటిని సమర్పించవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇందుకోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News June 28, 2024

న్యాయం చేయండి.. హోంమంత్రికి సచివాలయ మహిళా పోలీసుల వినతి

image

AP: వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు కలిశారు. డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

News June 28, 2024

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా..

image

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపట్లో అధికారిక వెబ్‌సైటుతో పాటు WAY2NEWS యాప్‌లో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఫలితాలను ఇతరులకూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

News June 28, 2024

వరల్డ్ రికార్డు సృష్టించిన భారత ఓపెనర్లు

image

అంతర్జాతీయ మహిళల టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ(180), జెమీమా(31) క్రీజులో ఉన్నారు.

News June 28, 2024

గౌరవ వేతనం ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు?

image

AP: ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి గౌరవ <<13525496>>వేతనం<<>> ఇవ్వనున్నారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపరింటెండెంట్స్, డి.తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులకు ఇది అందుతుంది. పోలింగ్, కౌంటింగ్‌కు లిమిటెడ్ పీరియడ్‌లో విధులు నిర్వహించిన జోనల్, రూట్, పోలింగ్, కౌంటింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లకు గౌరవ వేతనం అందదు.

News June 28, 2024

T20 WC ఫైనల్స్‌లోనూ సెంచరీ నమోదు కాకపోతే…

image

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో 90ల్లోకి వచ్చినా శతకం చేజార్చుకున్నారు. ఒకవేళ ఫైనల్‌లోనూ ఏ ఆటగాడు సెంచరీ కొట్టకపోతే ఇది వరల్డ్ కప్ చరిత్రలో ఒక్క శతకం లేని రెండో పర్యాయం అవుతుంది. 2009 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఏ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. కాగా.. ఈ ఏడాది పొట్టి కప్ ఫైనల్‌ రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది.

News June 28, 2024

OFFICIAL: ‘కల్కి’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

image

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు తెర పంచుకున్నారు.

News June 28, 2024

కాసేపట్లో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

image

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు మ.3గంటలకు విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైటుతో పాటు WAY2NEWS యాప్‌లో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఫలితాలను ఇతరులకూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

News June 28, 2024

లోపాలను సమీక్షించుకుంటాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం: కాకాణి

image

AP: అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశామని, ఇప్పుడు వారికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ హయాంలో జరిగిన లోపాలను సమీక్షించుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైసీపీకి ఆదరణ తగ్గలేదని, ఒంటరిగానే 40% ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పింఛన్ తప్ప మరే పథకం గురించి మాట్లాడట్లేదని విమర్శించారు.

News June 28, 2024

‘కల్కి’ బ్లాక్ బస్టర్.. నిర్మాత ట్వీట్ వైరల్

image

‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వేళ నిర్మాత స్వప్న దత్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీశాం’ అని ఆమె పోస్ట్ చేశారు. ‘కల్కి’ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి.