News June 28, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఫిరాయింపులపై మాట్లాడే నైతికత KCRకు లేదు: రేవంత్
* బీఆర్ఎస్‌ను మళ్లీ ప్రజలు గెలిపిస్తారు: కేసీఆర్
* ఆగస్టుకు ముందే రుణమాఫీ చేస్తాం: భట్టి
* బీజేపీకి అనుకూలంగా సీఎం వ్యవహారం: కేటీఆర్
* AP: పిన్నెల్లిని ఓడించి వేధించాలని CBN కుట్ర: వైసీపీ నేతలు
* వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ నాశనం: హోంమంత్రి అనిత

News June 27, 2024

కెప్టెన్‌గా 5వేల మార్కును దాటేశాడు

image

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో 5,000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో టీమ్ ఇండియా కెప్టెన్‌గా నిలిచారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12,833 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోని(11,207), అజహరుద్దీన్(8,095), గంగూలీ(7,643) ఉన్నారు. మరోవైపు టీ20WC ఒక ఎడిషన్‌లో అత్యల్ప బ్యాటింగ్ సగటు(10.71) నమోదు చేసిన భారత ఓపెనర్‌గా కోహ్లీ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

News June 27, 2024

ఎల్లుండి వరంగల్‌కు సీఎం రేవంత్!

image

TG: సీఎం రేవంత్ వరంగల్ పర్యటన ఎల్లుండికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీలో ఉన్నారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉండటంతో పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. కాగా వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు.

News June 27, 2024

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News June 27, 2024

రష్యా ఉపగ్రహం ముక్కలు.. ISSలో కలకలం

image

రష్యా 2022లో డీకమిషన్ చేసిన RESURS-P1 అనే ఉపగ్రహం తాజాగా ముక్కలైంది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కలకలం రేగింది. అందులోని వ్యోమగాములు అత్యవసరంగా సురక్షిత పాడ్స్‌లో తలదాచుకున్నారు. శాటిలైట్ ఎందుకు ముక్కలైందో తెలియాల్సి ఉందని US అంతరిక్ష శాఖ అధికారులు పేర్కొన్నారు. భూమి చుట్టూ శకలాల పరిభ్రమణం వేగం తీవ్రంగా ఉంటుంది. మిల్లీమీటర్ల సైజులో ఉండే శకలం కూడా పెను విధ్వంసాన్ని సృష్టించగలదు.

News June 27, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండొద్దు: మంత్రి రాజనర్సింహ

image

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని DMHOలను ఆదేశించారు. ప్రతి 30KM పరిధిలో PHC ఉండాలన్నారు. జిల్లా, ఏరియా, PHCల అనుసంధానంపై దృష్టిసారించాలని సూచించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

News June 27, 2024

రేపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

image

TG: రేపు మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న వెలువడిన వార్షిక ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను bse.telangana.gov.in వెబ్ సైట్‌తో పాటు వే2న్యూస్‌లో వేగంగా తెలుసుకోవచ్చు.

News June 27, 2024

‘కల్కి’: కృష్ణుడి పాత్రధారి ఇతనే?

image

‘కల్కి’ సినిమాలో కృష్ణుడి పాత్ర గురించి చర్చ నెలకొంది. ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి ఇతడేనని పలువురు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. కృష్ణ కుమార్ అలియాస్ కేకే ఆ రోల్‌లో కనిపించారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. KKకు సినీ రంగంలో పలు విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పాత్రకు యంగ్ నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పారని సమాచారం.

News June 27, 2024

మ్యాచుకు మళ్లీ వర్షం ఆటంకం.. భారత్ స్కోరు ఎంతంటే?

image

ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న T20WC సెమీ ఫైనల్ మ్యాచుకు వర్షం ఆటంకం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(37), సూర్య(13) ఉన్నారు. అంతకుముందు వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.

News June 27, 2024

ADC ఛైర్‌పర్సన్, ఎండీగా లక్ష్మీ పార్థసారథి నియామకం

image

AP: అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ADC) ఛైర్‌పర్సన్‌, ఎండీగా మాజీ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే ఆమె సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించారు. 2014-19 మధ్య ADC సీఎండీగా పార్థసారథి వ్యవహరించారు.