News June 27, 2024

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

image

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలని వ‌క్క‌లిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

News June 27, 2024

జియో రీఛార్జి ధరలు భారీగా పెంపు

image

జియో మొబైల్ రీఛార్జి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్‌ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.

News June 27, 2024

నీట్ పేపర్ లీకేజీ.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

image

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. బిహార్‌లోని పట్నాకు చెందిన మనీశ్ ప్రకాశ్, అశుతోశ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీలో మనీశ్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. మనీశ్‌కు అశుతోశ్ సాయం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరిని అధికారులు విచారించనున్నారు.

News June 27, 2024

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: CM చంద్రబాబు

image

AP: NTR, రామోజీరావు యుగపురుషులని CM చంద్రబాబు కొనియాడారు. ‘ఎప్పటినుంచో NTRకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేద్దాం. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం. ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి, NTR ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం’ అని సంస్మరణ సభలో ప్రకటించారు.

News June 27, 2024

ట్రినిడాడ్ పిచ్‌పై అఫ్గాన్ కోచ్ ఆగ్రహం

image

టీ20 WC తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గాన్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ట్రినిడాడ్ పిచ్ చెత్తగా ఉండటం వల్లే ఓడిపోయామంటూ ఆ జట్టు కోచ్ జొనాథన్ ట్రాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం ఓడామని ఇలా అనడం లేదు. సెమీఫైనల్ వంటి మ్యాచ్‌కు ఇలాంటి పిచ్ సరికాదు. పోటీ న్యాయంగా లేదు. ఇద్దరికీ పిచ్ ఇబ్బందిగానే ఉంది. కానీ తొలుత మేం తక్కువ స్కోరు చేయడంతో సఫారీలకు విజయం దక్కింది’ అని పేర్కొన్నారు.

News June 27, 2024

ప్రతి రంగంలోనూ రామోజీ నం.1గా ఎదిగారు: CBN

image

AP: ఎంచుకున్న ప్రతి రంగంలోనూ రామోజీరావు నంబర్ 1గా ఎదిగారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్, రామోజీని ఎవరూ అధిగమించలేరని చెప్పారు. ఆయనో అక్షర శిఖరమని, నీతి నిజాయితీకి ప్రతిరూపమని కొనియాడారు. ప్రజాహితమే లక్ష్యంగా ఆయన పనిచేశారని పేర్కొన్నారు. రామోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

News June 27, 2024

ఇంగ్లండ్‌లో కౌంటీలు, వన్డే కప్‌ ఆడనున్న రహానే

image

టీమ్ ఇండియా బ్యాటర్ అజింక్య రహానే ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో ఆడనున్నారు. అక్కడి వన్డే కప్, కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచులు ఆడేందుకు లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు లీసెస్టర్‌షైర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అతడి అనుభవం, నాయకత్వ సామర్థ్యం తమ జట్టుకు లాభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కౌంటీల్లో ఆడి రహానే ఫామ్‌లోకి రావాలంటూ టీం ఇండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News June 27, 2024

మూతలు టైట్‌గా పెడుతున్నాడని భర్తకు విడాకులు!

image

జాడీల మూతలు కావాలనే టైట్‌గా పెడుతున్నాడన్న ఆగ్రహంతో భర్త నుంచి విడాకులు కోరిందో భార్య. రెడ్డిట్ పోస్ట్‌లో ఈ ఘటన వైరల్‌గా మారింది. తాము కలిసున్న ఐదేళ్లుగా మూతలు తీసేందుకు తాను టార్చర్ అనుభవించానని డైవర్స్ పిటిషన్‌లో సదరు భార్య తెలిపారు. అతడి శాడిజం భరించడం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. అయితే, ఆహార పదార్థాలు తాజా ఉండాలనే తాను అలా చేసినట్లు భర్త సమర్థించుకున్నారు.

News June 27, 2024

రామోజీ వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టూ తీసుకోవాలి: పవన్

image

AP: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టూ తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మాటల్లో జర్నలిజం విలువలే కనిపించేవని చెప్పారు. విజయవాడలోని కానూరులో రామోజీ సంస్మరణ సభలో పవన్ మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చాక 2008లో ఆయనను తొలిసారి కలిసినట్లు చెప్పారు. జనం కోసం రామోజీ నిష్పాక్షికంగా ఉండేవారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు.

News June 27, 2024

డెన్మార్క్‌లో పాడి రైతులకు కార్బన్ ట్యాక్స్?

image

డెన్మార్క్‌లో ఆవులు, గొర్రెలు, పందులను పెంచుతూ జీవనం సాగించే వారికి ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. 2030 నుంచి కార్బన్ ట్యాక్స్ విధించేందుకు ప్లాన్ చేస్తోంది. హానికరమైన కార్బన్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే టన్ను కార్బన్‌డయాక్సైడ్‌కు 120 క్రోనర్ల (₹1430)తో ప్రారంభమై 2035 నాటికి 300 క్రోనర్ల (₹3500) వరకు చెల్లించాల్సి వస్తుంది.