News June 26, 2024

టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఎల్లుండి పల్లా బాధ్యతల స్వీకరణ

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మ.1.45కు ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. కాగా రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా విజయం సాధించిన విషయం తెలిసిందే.

News June 26, 2024

టికెట్ రీషెడ్యూల్ చేయలేదని బాంబు బెదిరింపు!

image

తన టికెట్‌ను రీషెడ్యూల్ చేయలేదన్న కోపంతో ఏకంగా విమానంలో బాంబుందని బెదిరించాడో వ్యక్తి. కేరళకు చెందిన షుహైబ్(30) తన భార్య, కుమార్తెతో కలిసి ఎయిర్ ఇండియా(ఏఐ) విమానంలో లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కుమార్తె ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో రీషెడ్యూల్ చేయాలని ఏఐను కోరారు. అధికారులు నిరాకరించడంతో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపునకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు షుహైబ్‌ను అరెస్ట్ చేశారు.

News June 26, 2024

ఆస్ట్రేలియా అతిపెద్ద శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో!

image

ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఇస్రో మరో ఘనత సాధించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. స్పేస్ మెషీన్స్ కంపెనీ రూపొందించిన ఈ ‘ఆప్టిమస్ స్పేస్‌క్రాఫ్ట్’ను 2026లో SSLV రాకెట్ ద్వారా ఇస్రో లాంచ్ చేస్తుంది. ఈ శాటిలైట్ బరువు 450 కిలోలు. మరో రెండు శాటిలైట్లను లాంచ్ చేసేందుకు కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

News June 26, 2024

వైసీపీ ప్రభుత్వం లెక్కలు తేలుస్తాం: అచ్చెన్నాయుడు

image

AP: సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి లెక్కలు తేల్చి తిన్నదంతా వసూలు చేస్తామని మీడియాతో చెప్పారు. సహకార సంఘాలు, డీసీసీబీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

News June 26, 2024

APలో MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

APలో MLAల ద్వారా జరిగే MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. YCP పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. C.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో 2 MLCలు ఖాళీ అయ్యాయి.

News June 26, 2024

శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే!

image

శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు లంకలో పర్యటించనుంది. జులై 27, 28, 30న టీ20 మ్యాచులు జరిగే అవకాశముంది. ఆగస్టు 2, 4, 7న వన్డేలు జరగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జులై 6-14 వరకు గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో ఐదు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.

News June 26, 2024

YCP ఆఫీసులకు నోటీసులపై స్టేటస్‌కో

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్టేటస్‌కో విధించింది. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని 10 YCP కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, కొన్నిచోట్ల కూల్చేయడాన్ని కోర్టులో ఆ పార్టీ ప్రస్తావించింది. దీంతో రేపు ఈ పిటిషన్‌పై విచారిస్తామని అప్పటివరకు స్టేటస్‌కో కొనసాగుతుందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

News June 26, 2024

చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు

image

AP: చిత్తూరు(D) కుప్పంలో CM చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. R&B గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు తమ రెండో కుమార్తెకు నామకరణం చేయాలని CBNను కోరారు. ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న బాబు ‘చరణి’ అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

News June 26, 2024

విద్య కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు!

image

ఇండియాలో పిల్లల చదువుపై పెడుతున్న ఖర్చు కంటే పెళ్లిళ్లపై రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని జెఫెరీస్ అనే ఓ క్యాపిటల్ మార్కెట్ సంస్థ నివేదిక పేర్కొంది. భారతీయులు ఏటా వివాహాల కోసం రూ.10.70 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నారని తెలిపింది. సగటున ఒక పెళ్లికి రూ.12.50 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై ఖర్చు కంటే రెండింతలు అని వివరించింది.

News June 26, 2024

ప్రమోషన్ లేకుండానే ఇంత బజ్: ఫ్యాన్స్

image

సాధారణంగా సినిమా రిలీజ్ అంటే కనీసం నెల రోజుల ముందు నుంచి హీరో, దర్శకులు ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంటారు. కానీ ‘కల్కి’ మూవీ టీమ్ టాలీవుడ్‌లో ప్రమోషన్స్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్లు ఇందులో నటించడమే కారణమని చర్చ నడుస్తోంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఉద్దేశించి ప్రమోట్ చేయకుండానే ఇంత బజ్ ఎలా వచ్చిందయ్యా అని నెట్టింట పోస్టులు చేస్తున్నారు.