News June 25, 2024

ఏపీలో ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు!

image

ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది. పలు దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి గుజరాత్‌లోని వడోదర యూనివర్సిటీ నిపుణులు చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగుచూసింది. అందులో 911 గుడ్లకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని వారు తెలిపారు. భారత్ ఒకప్పుడు వైవిధ్యమైన ఎన్నో జీవజాతులకు ఆలవాలంగా ఉండేదని చెప్పేందుకు ఈ గూడు ఓ నిదర్శనమని వివరించారు.

News June 25, 2024

పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తా: చంద్రబాబు

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను కొట్టేసే కుట్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ‘ఆ యాక్ట్ సరైనది కాదని దాన్ని రద్దు చేశాం. మీరు కష్టపడి సంపాదించుకున్న భూమికి చెందిన పట్టా పాసు పుస్తకంపై జగన్ బొమ్మ వేసుకున్నారు. త్వరలోనే వాటిపై జగన్ బొమ్మ తీసేస్తా. రాజముద్రతో కొత్త పుస్తకాలు ముద్రించి ఇస్తా’ అని కుప్పం సభలో CM ప్రకటించారు.

News June 25, 2024

చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా

image

చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలివైపున ఉన్న మట్టి నమూనాల్ని చైనా ఈరోజు భూమికి తీసుకొచ్చింది. ఆ దేశ లూనార్ ల్యాండర్ చాంగే-6 మంగోలియాలో ల్యాండ్ అయింది. ఈ ఏడాది మే 3న బయలుదేరిన చాంగే-6, ఈ నెల 2న చంద్రుడికి అవతలివైపున ల్యాండ్ అయింది. అక్కడి నమూనాల్ని సేకరించి తిరిగి నేడు భూమిపైకి చేరుకుంది. ఈ నమూనాల ద్వారా చంద్రుడి ఉపరితలం గురించిన కొత్త అంశాలు తెలుస్తాయని చైనా పరిశోధకులు తెలిపారు.

News June 25, 2024

వైసీపీ పాలన పీడకల: చంద్రబాబు

image

AP: గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల వంటిదని, అలాంటి పాలనను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది టీడీపీ కార్యకర్తలను జైలులో పెట్టారని కుప్పం బహిరంగసభలో దుయ్యబట్టారు. కుప్పంలో రౌడీయిజం చేస్తే ఉపేక్షించబోమని, వారికి ఇదే చివరి రోజని హెచ్చరించారు. మంచి వాతావరణ పరిస్థితులు ఉండే ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

News June 25, 2024

భేష్ నితీశ్.. శుభాకాంక్షలు: వైఎస్ జగన్

image

AP: జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారని ఆ పార్టీ పేర్కొంది. ‘జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్‌ జట్టులో విశాఖకు చెందిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ చోటు సంపాదించడంపై జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ టూర్‌లో మంచి ప్రతిభ చూపాలని, కెరీర్లో మరింత ఎదగాలని ఆకాంక్షించారు’ అని Xలో పోస్ట్ చేసింది.

News June 25, 2024

జులైలో రష్యాకు ప్రధాని మోదీ!

image

ప్రధాని మోదీ వచ్చే నెలలో రష్యాలో పర్యటించనున్నారని తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య వార్షిక చర్చల కోసం పుతిన్‌తో మోదీ సమావేశమవుతారని రష్యా మీడియా పేర్కొంది. ముందు నుంచి భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన జరగనున్నట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ విషయంలోనూ భారత్ స్వతంత్ర వైఖరి అవలంబిస్తోంది.

News June 25, 2024

గిరిజన ప్రాంతాల్లో రేషన్ షాపుల్లోనే రేషన్: సంధ్యారాణి

image

AP: గిరిజన ప్రాంతాల్లో MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ఇకపై రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో 960 రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. గిరిజన వసతిగృహాల్లో ANMలు, ఫీడర్ అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు మళ్లీ తెస్తామని వెల్లడించారు.

News June 25, 2024

పెళ్లి కాదు.. కొత్త సినిమా ప్రకటన

image

పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారానికి హీరోయిన్ నివేదా థామస్ తెరదించారు. నంద కిశోర్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ ‘35 చిన్న కథ కాదు’ను హీరో రానా దగ్గుబాటి రివీల్ చేశారు. ప్రియదర్శి, విశ్వదేవ్ నటిస్తున్న ఈ మూవీ AUG 15న విడుదల కానున్నట్లు తెలిపారు. కాగా ‘చాలా రోజుల తర్వాత ఫైనల్లీ’ అంటూ నివేదా నిన్న ట్వీట్ చేయడంతో ఆమె పెళ్లి గురించి కావొచ్చని చర్చ జరిగింది.

News June 25, 2024

బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డులతో మార్కెట్లు క్లోజ్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. తొలిసారిగా సెన్సెక్స్ 78వేల మార్క్, నిఫ్టీ 23,700 దాటి జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. 712 పాయింట్ల లాభంతో 78,053 వద్ద సెన్సెక్స్, 183 పాయింట్ల లాభంతో 23,721 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగించాయి. రియల్టీ షేర్లు నష్టాలను నమోదు చేసినా బ్యాంకింగ్ రంగం దూసుకెళ్లడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు.

News June 25, 2024

ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతివ్వని మమత?

image

ఇండియా కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా కే.సురేశ్‌ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. సురేశ్‌తో నామినేషన్ వేయించే విషయంలో ముందుగా TMCని సంప్రదించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.