News June 24, 2024

వర్షంతో నిలిచిన భారత్-ఆసీస్ మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌లో 4.1 ఓవర్ల వద్ద వర్షం మొదలైంది. అప్పటికి భారత స్కోర్ 43 కాగా కెప్టెన్ రోహిత్ మంచి ఊపులో ఉన్నారు. కేవలం 14 బంతుల్లోనే రోహిత్ 41 రన్స్‌ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు. కోహ్లీ డకౌట్ కాగా క్రీజులో రోహిత్‌పాటు పంత్ ఉన్నారు.

News June 24, 2024

మెగాస్టార్‌తో హరీశ్ శంకర్ సినిమా?

image

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

News June 24, 2024

ఛాతివైపు జరిగిన జీర్ణాశయం.. 90ఏళ్ల వృద్ధుడికి అరుదైన సర్జరీ!

image

శ్వాస, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న 90ఏళ్ల వృద్ధుడికి ఢిల్లీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను చేశారు. హియాటస్ హెర్నియానే ఆ వృద్ధుడి అస్వస్థతకు కారణమట. జీర్ణాశయంలోని పైభాగం ఛాతికి దగ్గరగా జరగడంతో వాంతులు, విపరీతమైన నొప్పితో బాధపడేవారట. 11 రోజుల్లో 5 కిలోలు తగ్గారు. సమస్యను గుర్తించి వైద్యులు సర్జరీ చేయడంతో ఆయన కోలుకున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, 1% కూడా ఉండవని వైద్యులు తెలిపారు.

News June 24, 2024

గుడివాడ అమర్నాథ్‌కు GVMC నోటీసులు

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గాజువాక చట్టివానిపాలెం సర్వేనంబర్ 79/9aలో అనుమతి లేకుండా 4 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదుతో GVMC అధికారులు నోటీసులు ఇచ్చారు.

News June 24, 2024

తిరుమల శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష

image

AP: తిరుమల ఆలయ చరిత్ర, వాస్తు శిల్పం, విశిష్టత విషయాలపై అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. వైఖానస ఆగమము, జీయంగార్ల వ్యవస్థ, భక్తులకు అందించే సేవా కార్యక్రమాలపై ఆరా తీశారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News June 24, 2024

వాలంటీర్లకు ఇచ్చే అలవెన్స్ రద్దు

image

AP: వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్స్(రూ.200) రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దినపత్రిక అలవెన్స్ కోసం చెల్లింపులు జరపవద్దని అధికారులను ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. పేపర్ కొనుగోలుకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తాజాగా మెమో జారీ చేసింది.

News June 24, 2024

ఆ ప్రచారం అవాస్తవం: హిరాణీ సన్నిహితులు

image

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించనున్న చిత్రంలో షారుఖ్ ఖాన్, సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారాన్ని డైరెక్టర్ రాజ్‌కుమార్ సన్నిహితులు కొట్టిపారేశారు. అసలు షారుఖ్, సమంతలతో ఇప్పటి వరకు చర్చలే జరపలేదని స్పష్టం చేశారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదన్నారు. అలాగే దేశభక్తి, యాక్షన్ డ్రామా నేపథ్యంలో మూవీ ఉండనుందనే వార్తలనూ కొట్టిపారేశారు.

News June 24, 2024

భారత జట్టుకు ఎంపికైన తెలుగు తేజం

image

తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. SRH తరఫున అదరగొట్టిన ఈ ప్లేయర్ జింబాబ్వేతో జరిగే T20 సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఐపీఎల్‌లో SRH తరఫున 15 మ్యాచులు ఆడిన నితీశ్ 303 పరుగులు చేశారు. అజారుద్దీన్, రాయుడు, సిరాజ్, లక్ష్మణ్, భరత్, MSK తదితరులు తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

News June 24, 2024

ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ రద్దు: కోమటిరెడ్డి

image

TG: ఉప్పల్-ఘట్‌కేసర్ మధ్య ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చర్యలకు ఆదేశించారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త టెండర్లు పిలవాలని చెప్పినట్లు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి.. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం చేస్తున్నారని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.

News June 24, 2024

T20 WC: టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్

image

సూపర్-8లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నారు.
IND: రోహిత్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్
AUS: హెడ్, వార్నర్, మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, వేడ్, కమిన్స్, జంపా, హేజిల్‌వుడ్, స్టార్క్