News June 22, 2024

29 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. భారీ భద్రత

image

ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు LG మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచికగా ఇవాళ నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది.

News June 22, 2024

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

T20, ODI వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఇవాళ బంగ్లాదేశ్‌పై 37 రన్స్ చేసిన ఆయన.. మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్(2,637), వార్నర్(2,502), సచిన్(2,278), సంగక్కర(2,193), షకీబ్ అల్ హసన్(2,174), గేల్(2,151) ఉన్నారు.

News June 22, 2024

ఏపీలో పలువురు IASల బదిలీ

image

ఏపీలో పలువురు IASలను ప్రభుత్వం బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్‌గా S.నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్.అంబేడ్కర్, ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, NTR-సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్‌గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

News June 22, 2024

ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక వేధింపుల కేసు

image

కర్ణాటకలోని హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కేసు నమోదైంది. సూరజ్ ఈనెల 16న తనను ఫామ్ హౌస్‌కి పిలిచి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహకరించకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సూరజ్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే మహిళపై లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

News June 22, 2024

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా

image

రేపు(ఆదివారం) జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు NTA ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను కేంద్రం ఇవాళ పదవి నుంచి తొలగించింది.

News June 22, 2024

జనాభా ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ కేటాయింపులుండాలి: భట్టి

image

TG: కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రానికి కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాది ఈ విభాగంలో 1.4% నిధులే వచ్చాయన్నారు. ‘జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఉపాధి హామీ నిధులను ఆస్తుల సృష్టి పనులకు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. TGలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి’ అని కోరామన్నారు.

News June 22, 2024

TG: రేపు 10 జిల్లాల్లో భారీ వర్షాలు

image

రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు పడే జిల్లాల జాబితాను పైన ఫొటోలో చూడొచ్చు.

News June 22, 2024

T20 WC: రికార్డు సృష్టించిన షకీబ్ అల్ హసన్

image

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచారు. 40 ఇన్నింగ్స్‌లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది (39 వికెట్లు), లసిత్ మలింగా (38), హసరంగా (37), సయీద్ అజ్మల్ (36), టిమ్ సౌథీ (36) ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు తీశారు.

News June 22, 2024

T20WC: భారత్ భారీ స్కోర్

image

T20WC సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 196/5 స్కోర్ చేసింది. హార్దిక్ 27 బంతుల్లో 50*(3 సిక్సులు, 4 ఫోర్లు) పరుగులతో అదరగొట్టారు. కోహ్లీ 37, పంత్ 36, దూబే 34, రోహిత్ 23, సూర్య 6 పరుగులు చేశారు. తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.

News June 22, 2024

భారత్ సాయంతోనే కోలుకున్నాం: విక్రమసింఘే

image

భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు వివరించారు.