News June 22, 2024

YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

image

AP: తాడేపల్లిలో YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై YS జగన్ స్పందించారు. ‘రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన YCP కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని ట్వీట్ చేశారు.

News June 22, 2024

USAపై వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్8 పోరులో USAపై వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమెరికా 128 రన్స్ చేయగా ఛేదనకు దిగిన విండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 130 రన్స్ కొట్టింది. ఓపెనర్ హోప్(82రన్స్, 39బంతుల్లో) భారీ అర్ధశతకంతో మెరుపులు మెరిపించారు. ఆ గెలుపుతో వెస్టిండీస్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండగా USA ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.

News June 22, 2024

4 గంటలు ఆలస్యంగా విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్

image

విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.45 గంటలకు ట్రైన్ విశాఖ నుంచి బయల్దేరాలి. కానీ సి-9 కోచ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఉ.10 గంటలకు ట్రైన్ బయల్దేరనుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News June 22, 2024

అమరావతిలో ముళ్ల కంపల తొలగింపునకు చర్యలు: మంత్రి

image

AP: అమరావతి ప్రాంతంలో ముళ్ల కంపలను తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. 217 చదరపు కిలోమీటర్లలో మెజార్టీ ఏరియా అడవిలా తయారైందని చెప్పారు. ముళ్ల కంపలను తొలగించిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై అంచనాకు వస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు.

News June 22, 2024

తగ్గిన విదేశీ మారక నిల్వలు

image

విదేశీ మారక నిల్వలు తగ్గినట్లు RBI తెలిపింది. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి గాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బి.డాలర్లకు చేరినట్లు తెలిపింది. అంతకుముందు వారం రికార్డు స్థాయి 655.817 బి.డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. యూరో, పౌండ్, యెమెన్ కరెన్సీలు ఒత్తిడికి గురికావడమే ఫారెక్స్ నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం రిజర్వులు కూడా 1.015 బి. డాలర్లు తగ్గి 55.967 బి.డాలర్లకు పడిపోయాయి.

News June 22, 2024

NTA అంటే ఏంటి? ఏం చేస్తుంది?

image

NTA అనేది కేంద్ర విద్యా శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది JEE(Main), UGC NET, CMAT&GPAT, NEET UG నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫార్మసీకి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఫెలోషిప్ కోసం పరీక్షల నిర్వహణ చూసుకుంటుంది. ఇది 2017లో స్థాపితమైంది. ఇది ఫ్రీగా మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తుంది. <>వెబ్‌సైట్<<>> లేదా NTA STUDENT APP యాప్ ద్వారా రిజిస్టర్ కావచ్చు.

News June 22, 2024

వైఎస్ భారతి పీఏ అరెస్ట్?

image

AP: మాజీ CM జగన్ సతీమణి భారతి PA వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సోషల్ మీడియాలో విపక్ష మహిళా నేతలే టార్గెట్‌గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై అభియోగాలున్నాయి. తనపై, YS షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ YS సునీత చేసిన ఫిర్యాదుతో రవీంద్రపై సైబరాబాద్ క్రైం పోలీసులు సైతం ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. అటు రవీంద్రపై చర్యలుంటాయని ఇప్పటికే హోంమంత్రి అనిత తెలిపారు.

News June 22, 2024

నేడు పులివెందులకు జగన్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరుతారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.

News June 22, 2024

వెస్టిండీస్ లక్ష్యం 129 పరుగులు

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో సూపర్ 8 మ్యాచ్‌లో USA జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. 19.5 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది. గౌస్(29), నితీశ్ కుమార్(20) మాత్రమే ఫరవాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ 3, ఛేస్ 3, జోసెఫ్ 2, మోతీ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

News June 22, 2024

రూ.2 లక్షల రుణమాఫీ.. ఎల్లుండి మార్గదర్శకాలు?

image

TG: ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామన్న CM రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని, వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.