News June 21, 2024

బొగ్గు గనులు వేలంలో ఉంచడం బాధాకరం: భట్టి

image

TG: రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేయడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYDలో నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు సింగరేణి మూతపడే ప్రమాదం ఉందన్నారు.

News June 21, 2024

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో జులై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

News June 21, 2024

నీట్ కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ

image

నీట్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్ పిటిషన్లతో కలిపి విచారించనుంది. తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

News June 21, 2024

బొగ్గు గనుల వేలం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి దూబే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. వేలంలో సింగరేణి పాల్గొంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. అంతకుముందు కిషన్ రెడ్డితో భట్టి, సింగరేణి సీఎండీ బలరాం భేటీ అయ్యారు. శ్రావణపల్లి గనిని సింగరేణికి కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

News June 21, 2024

మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి?

image

కేసీఆర్‌ లక్ష్మీ పుత్రుడిగా పేరున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ చెప్పడంతో ఈ ప్రచారం మరింత బలపడింది.

News June 21, 2024

ఆ రంగాల్లో భారీగా ఎఫ్ఐఐ అమ్మకాలు

image

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈనెల తొలి రెండు వారాల్లో ఆయిల్ & గ్యాస్, నిర్మాణం, ఐటీ రంగాలకు సంబంధించి భారీగా షేర్స్ విక్రయించారు. ఆయిల్ & గ్యాస్‌- ₹3,683 కోట్లు, నిర్మాణం- ₹2,660 కోట్లు, ఐటీ- ₹2,559 కోట్లు, మెటల్స్ & మైనింగ్‌లో ₹1,861 కోట్ల విలువైన షేర్లు సేల్ చేశారు. అయితే రియల్టీ, టెలికాం, కన్జూమర్ సర్వీసెస్, కెమికల్ రంగాల్లో మాత్రం FII కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

News June 21, 2024

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఎన్నికలకు ముందు KCRకు అత్యంత సన్నిహితుడు కే.కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా KCR‌ విధేయుల్లో ఒకరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి CM రేవంత్ సమక్షంలో INCలోకి వెళ్లడంతో BRS శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పోచారానికి ‘లక్ష్మీపుత్రుడు’ అని పేరు పెట్టిన KCR.. గతంలో ఆయనకు వ్యవసాయశాఖ మంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ పదవులు ఇచ్చారు.

News June 21, 2024

రేవంత్‌ను నేనే ఇంటికి ఆహ్వానించా: పోచారం

image

TG: రైతు పక్షపాతిగా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాజకీయంగా ఇంకా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమే. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తా’ అని పోచారం వెల్లడించారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.

News June 21, 2024

శ్రీనివాస్ రెడ్డి అండగా ఉంటామన్నారు: సీఎం రేవంత్

image

TG: పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో రైతు సమస్యలపై తీసుకోనున్న కీలక నిర్ణయాల గురించి ఆయనతో చర్చించాం. మాకు అండగా ఉంటామని చెప్పారు. పార్టీలోని సీనియర్ల మాదిరే శ్రీనివాస్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారు’ అని సీఎం వివరించారు.

News June 21, 2024

బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ జోక్యం చేసుకోరు: అక్షర్

image

టీమ్‌ఇండియా పేస్ గన్ బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ కూడా పెద్దగా జోక్యం చేసుకోరని సహచర బౌలర్ అక్షర్ పటేల్ వెల్లడించారు. బుమ్రాకు మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసని అన్నారు. బౌలింగ్ కోచ్ కూడా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి అతడిని అనవసరంగా గందరగోళానికి గురిచేయరని పేర్కొన్నారు. బుమ్రాను తన వ్యూహాలకు అనుగుణంగానే బౌలింగ్ చేయమని ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చారు.