News January 10, 2025

విశాల్ త్వరలోనే కోలుకుంటారు: జయం రవి

image

హీరో విశాల్ అనారోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. కష్టాలను అధిగమించి ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ‘విశాల్ చాలా ధైర్యవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. త్వరలోనే సింహం మాదిరి గర్జిస్తారు’ అని పేర్కొన్నారు. <<15094492>>‘మదగజరాజు’<<>> ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ మాట్లాడటం అభిమానులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

News January 10, 2025

ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

image

AP: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. జనరేట్ ఏఐని ఉపయోగించేలా ఫ్లాట్‌పామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు

image

‘గేమ్ ఛేంజర్’ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. ‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్‌లో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. ఈ సినిమాను అందించినందుకు శంకర్‌కు ధన్యవాదాలు. నాకు చరణ్ నటించిన మూవీల్లో మగధీరలో హర్ష& కాలభైరవ, ఆరెంజ్‌లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRRలో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం’ అని తెలిపారు.

News January 10, 2025

TTD ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలేవీ: అంబటి

image

AP: తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వీరిపై సీఎం చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘అసలు బాధ్యులను వదిలేసి వేరేవారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేయడం ఏంటీ? అసలైన బాధ్యులు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబుకు పాపం తగులుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News January 10, 2025

బీఎల్‌ఎన్ రెడ్డిపై కొనసాగుతున్న ACB విచారణ

image

TG: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. అప్పటి నుంచీ అధికారులు ఆయన్ను పలు ప్రశ్నలపై విచారిస్తున్నారు. రేసు సమయంలో రెడ్డి HMDA ముఖ్య ఇంజినీర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో FEOకి 45.71 కోట్ల బదిలీ, HMDAపై ఆదాయ పన్ను భారంపై ఏసీబీ వరస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

News January 10, 2025

మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

image

AP: 1995లో ఏమీలేని స్థితి నుంచి HYDను అభివృద్ధి చేశామని CM చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏపీ నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టిసారించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ₹4L Cr పెట్టుబడులకు సంతకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ ‘YCP ప్రభుత్వం చేసిన అక్రమాలతో భూసమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News January 10, 2025

పన్నుల వాటా.. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇలా

image

FY2024-25కు గాను పన్నుల వాటా కింద రాష్ట్రాలకు రూ.1,73,030 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి రూ.31,039 కోట్లు కేటాయించగా, ఏపీకి రూ.7,002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు దక్కాయి. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఈ నిధులను రిలీజ్ చేసింది. బిహార్‌కు రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, బెంగాల్‌కు రూ.13,017 కోట్లు కేటాయించింది.

News January 10, 2025

BREAKING: పరీక్ష తేదీలు వచ్చేశాయ్

image

APలో 8 ఉద్యోగ నోటిఫికేషన్ల <>పరీక్ష తేదీలను<<>> APPSC ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ విభాగంలో లైబ్రేరియన్లు, Asst.ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, Asst.స్టాటిస్టికల్ ఆఫీసర్, Asst.ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, Asst.కెమిస్ట్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో Asst.డైరెక్టర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు వివిధ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

News January 10, 2025

అటూ ఇటూ ఊగిసలాట.. చివరికి నష్టాలు

image

స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిస‌లాట‌ల‌తో సాగాయి. బెంచ్ మార్క్ సూచీల్లో కీల‌క స‌పోర్ట్‌, రెసిస్టెన్స్ స్థాయుల్లో బుల్స్‌-బేర్స్ త‌మ ప‌ట్టు నిలుపుకున్నారు. Sensex 241 పాయింట్లు కోల్పోయి 77,378 వ‌ద్ద‌, Nifty 95 పాయింట్ల న‌ష్టంతో 23,431 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. IT స్టాక్స్ 3.44% లాభ‌ప‌డి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇత‌ర అన్ని రంగాలు న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. Q3 ఫలితాలు మెప్పించడంతో TCS 5.60% లాభపడింది.

News January 10, 2025

ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు

image

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.