India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వివరించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. Jan 17 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. అధికార ఆప్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖరారు చేసి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒకే విడతలో Feb 5న జరగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
రిషభ్ పంత్ దూకుడైన ఆటతో పాటు డిఫెన్స్ బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. BGTలో పంత్ పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు స్పందించారు. అతను డిఫెన్స్ చేస్తూ 10సార్లు ఔట్ అయిన క్లిప్ చూపిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పంత్ డిఫెన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదని కొనియాడారు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పారు.
నేడు రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో IAS అధికారిగా చరణ్ కనిపించారు. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించగా, ఓ IASను స్ఫూర్తిగా తీసుకుని ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ అధికారే తమిళనాడు కేడర్‌కు చెందిన TN శేషన్. 90వ దశకంలో భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో రాజకీయ నాయకులను గడగడలాడించారని చెబుతుంటారు. దీంతో ఆయన కెరీర్ కేసులు, వివాదాలతోనే నడిచింది.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ‘జనసాధారణ్’ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఇవి చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ప్రత్యేక రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్ల పూర్తి వివరాలను పై ఫొటోలో చూడొచ్చు. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల మోత ఉండటంతో చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
క్యాన్సర్ కేసులు పెరుగుతుండటంతో, అది దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. ‘ప్లాస్టిక్‌కు నో చెప్పండి. స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు వస్తువులు వాడండి. సిరామిక్ వంటసామగ్రి ఎంచుకోండి. ప్యాక్ చేసిన కేకులు వద్దు. గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్స్ స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ను భర్తీ చేయండి. పండ్లు, కూరగాయలు వాడేముందు బేకింగ్ సోడా నీటిలో నానబెట్టండి’ అని తెలిపారు.
ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నా యజమానుల తీరు మారట్లేదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని వారు పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. తాజాగా L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాడెద్దుల్లా పనిచేయాలన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఉద్యోగం చేస్తున్నా గుర్తింపులేదని వాపోతున్నారు.
Sorry, no posts matched your criteria.