News June 14, 2024

మరో 3 రోజులు వర్షాలు

image

రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. KNR, PDPL, BPL, NLG, SPT, MHBD, WGL, HMK, SDPT, BNR, RR, HYD, VKD, SND, MDK, ములుగు, జనగామ జిల్లాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు పడతాయని తెలిపింది. అటు APలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

News June 14, 2024

జమ్మూలో ఉగ్రదాడులు అందుకే పెరుగుతున్నాయా?

image

అసెంబ్లీ ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతోనే జమ్మూలో ఉగ్రదాడులు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పాక్ ఆగడాలకు చెక్ పడడంతోనే టెర్రరిస్టులు జమ్మూపై దృష్టి పెట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌లో ఉన్నంత ఇంటెలిజెన్స్, భద్రత జమ్మూలో లేదని, అందుకే టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, దాడులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు .

News June 14, 2024

పాత DSC రద్దు!

image

AP: వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.

News June 14, 2024

రాహుల్ గాంధీకి వయనాడ్ కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞప్తి

image

వయనాడ్, రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘మా ప్రియమైన పెద్దన్న రాహుల్ గాంధీ. మమ్మల్ని వదిలి వెళ్లకండి. కచ్చితంగా వెళ్లాల్సి వస్తే.. మీ సోదరి ప్రియాంకాగాంధీని మమ్మల్ని చూసుకోమని చెప్పండి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.

News June 14, 2024

సింగరేణి కార్మికులకు GOOD NEWS

image

TG: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాల వడ్డీ రాయితీపై యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం ప్రారంభించిన/ కొనుగోలు చేసిన ఏడాదిలో బ్యాంకు రుణం పొందితేనే రాయితీని ఇచ్చేది. ఇప్పుడా కాలపరిమితిని ఎత్తేసింది. అలాగే ప్రస్తుతం 8.33% కన్నా తక్కువ వడ్డీకి రుణం తీసుకున్నవారికి మాత్రమే 6-7% రాయితీ ఇస్తుండగా, ఇకపై 8.3% వరకు వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో 4వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

News June 14, 2024

రామ్మోహన్ లాంటి నాయకుడు దేశానికి అవసరం: MP విశ్వేశ్వర్ రెడ్డి

image

పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడును తెలంగాణ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ‘2014లో యంగెస్ట్ ఎంపీల్లో మీరూ ఒకరు. లోక్ సభలో మీ పనితీరు అద్భుతంగా ఉండేది. అప్పుడే సీనియర్ ఎంపీలందరూ మిమ్మల్ని గుర్తించారు. మన దేశానికి మీలాంటి విజ్ఞానవంతులు, వాగ్ధాటి గల యువ నాయకుడు మన దేశానికి అవసరం. మిమ్మల్ని కేంద్రమంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News June 14, 2024

నటి శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశారు. సత్‌యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్పా, రాజ్‌కుంద్రాతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ఉద్యోగి మోసం చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జడ్జికి చూపడంతో కేసు నమోదుకు ఆదేశించారు.

News June 14, 2024

T20WCలో ప్రపంచ రికార్డు

image

T20WC హిస్టరీలో అత్యంత వేగంగా(3.1 ఓవర్లలో 48) లక్ష్యాన్ని <<13436346>>ఛేదించిన<<>> జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. గతంలో శ్రీలంక 5 ఓవర్లలో(VSనెదర్లాండ్స్) 40, న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో(VSఇంగ్లండ్) 52, ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో(VSనమీబియా) 73, విండీస్ 5.5 ఓవర్లలో(VS ఇంగ్లండ్)60 టార్గెట్లను ఛేజ్ చేశాయి.

News June 14, 2024

DSC పోస్టులపై వైసీపీ vs టీడీపీ

image

AP: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు మెగా మోసం చేశారన్న YCP విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ఐదేళ్లు మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ? వచ్చిన మొదటి రోజే 16వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడ?’ అని Xలో రిప్లై ఇచ్చింది. కాగా, 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు.. 16,347 పోస్టులే ఇచ్చారని అంతకుముందు వైసీపీ ట్వీట్ చేసింది.