News June 14, 2024

గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టిన లంక

image

మాజీ ఛాంపియన్ శ్రీలంక టీ20 ప్రపంచకప్-2024 నుంచి ఎలిమినేట్ అయింది. సౌతాఫ్రికా, బంగ్లాతో ఓటములు, నేపాల్‌తో మ్యాచ్ రద్దుతో గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. ఈ టోర్నమెంటులో 3 మ్యాచులు ఆడిన హసరంగా సేన.. కేవలం ఒకే పాయింట్ సాధించింది. గ్రూప్-D నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్-8కి చేరింది. ఆ గ్రూపులోని నెదర్లాండ్స్, నేపాల్‌లతో పోలిస్తే సూపర్-8కు వెళ్లేందుకు బంగ్లాకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

News June 14, 2024

ZP హైస్కూల్‌లో ‘నో అడ్మిషన్స్’ బోర్డు

image

TG: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సిద్దిపేటలోని ZP హైస్కూల్‌ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది 6-10 తరగతుల్లో 250 సీట్లు ఉంటే ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును యాజమాన్యం వేలాడదీసింది. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనుంది. గత ఏడాది ఇక్కడ 231 మంది టెన్త్ పరీక్ష రాస్తే 99.13 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒక్కరే ఫెయిల్ అయ్యారు.

News June 14, 2024

కూతురితో రోహిత్ ఆట.. క్యూట్ ❤️ ఫొటో

image

T20WCలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ టైమ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. కెనడాతో చివరి మ్యాచ్‌ కోసం ఫ్లోరిడా చేరుకున్న ఆయన అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కడుతూ కూతురితో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది క్యూటెస్ట్ ఫొటో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News June 14, 2024

AP: పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?

image

✒ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)
✒ దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
✒ కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000
✒ కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)
✒ మంచానికి పరిమితమైనవారికి ₹15,000(గతంలో ₹5వేలు)

News June 14, 2024

‘జగన్ ఫొటోతోనే విద్యాకానుక’ ప్రచారం అవాస్తవం: సమగ్రశిక్ష

image

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో జగన్ ఫొటోలతోనే ఉన్న <<13429707>>విద్యాకానుక<<>>(స్టూడెంట్ కిట్) పంపిణీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్రశిక్ష అభియాన్ ఖండించింది. ‘2024-25లో సరఫరా చేసే వస్తువులలో ఎలాంటి రాజకీయ చిహ్నాలు, ఫొటోలు ముద్రించొద్దని మార్చిలోనే కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చాం. వారు అలాగే సరఫరా చేశారు. ఎక్కడైనా పాత స్టాక్ ఉంటే విద్యార్థులకు ఇవ్వొద్దని DEO, MEOలకు సూచించాం’ అని పేర్కొంది.

News June 14, 2024

ఇవాళ TG ఐసెట్ ఫలితాలు విడుదల

image

TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు. ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ లింబాద్రి, కాక‌తీయ వ‌ర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ వాకాటి క‌రుణ ఫలితాలు రిలీజ్ చేస్తారు. జూన్‌ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77,942 మంది హాజరైన విషయం తెలిసిందే.

News June 14, 2024

ఏపీకి BPCL రిఫైనరీ ప్రాజెక్టు కోసం అధికారుల యత్నం?

image

AP: రాష్ట్రానికి BPCL రిఫైనరీ ప్రాజెక్టును సాధించేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు స్థలాలను కూడా ప్రతిపాదించారు. దీనిద్వారా రూ.50వేల కోట్లను సంస్థ పెట్టుబడి పెట్టనుంది. ఇది పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం యూపీ, గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి. విభజన హామీ మేరకు ఏపీకి రిఫైనరీ ప్రాజెక్టును కేటాయించాలని అధికారులు కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నారు.

News June 14, 2024

పృథ్వీరాజ్‌పై అరెస్టు వారెంట్

image

AP: భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేసింది. నెలకు రూ.22వేల మనోవర్తితోపాటు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పృథ్వీ పాటించలేదని భార్య శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చింది.

News June 14, 2024

18 నుంచి బడ్జెట్ సన్నాహక భేటీలు

image

TG: జులై మొదటి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖలవారీగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పథకాలకు ఖర్చయ్యే మొత్తం, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆర్థికశాఖ వివరాలు సేకరిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర పద్దుకు తుది మెరుగులు దిద్దనున్నట్లు సమాచారం.

News June 14, 2024

బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాక్‌.. మోసపూరిత మెసేజ్‌లతో జాగ్రత్త

image

TG: రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్‌ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. వీటికి స్పందించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.