News June 14, 2024

19 బంతుల్లో రన్ ఛేజ్.. ఇంగ్లండ్ ఘన విజయం

image

T20WCలో ఒమన్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48 పరుగుల లక్ష్యాన్ని 3.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. సాల్ట్ 12, బట్లర్ 24, విల్ జేక్స్ 5, బెయిర్‌స్టో 4 రన్స్ చేశారు.

News June 14, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

పెట్టిపోయలేని వట్టి నరుడు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనజెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పుట్టలోని చెదలు పుట్టి మరణిస్తాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే అవసరంలో ఉన్నవారికి దానధర్మములు చేయని మనిషి పుట్టినా, మరణించినా ప్రయోజనం లేదు.

News June 14, 2024

T20WC: ఒమన్ 47 ఆలౌట్

image

T20WCలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఒమన్ టీమ్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షోయబ్ ఖాన్ 11 మినహా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 3, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశారు. WC హిస్టరీలో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. గతంలో ఉగాండ 39(VS విండీస్), నెదర్లాండ్స్ 39(VS శ్రీలంక), 44(VS శ్రీలంక) స్కోర్లు నమోదు చేశాయి.

News June 14, 2024

ఈవీఎంలలో ఓటర్ల మ్యాజిక్ కనిపించింది: శరద్ పవార్

image

వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని NCP-SP చీఫ్ శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘LS ఎన్నికల సమయంలో ప్రజలు మనసులో ఏముందో చెప్పలేదు. అయినా ఆందోళన చెందొద్దని, వారు EVMలో సరైన బటన్ నొక్కుతారని కార్యకర్తలకు చెప్పా. వాటిని తెరిచినప్పుడు ఓటర్లు చేసిన మ్యాజిక్ కనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో NCP-SP 8 సీట్లు గెలుచుకుంది.

News June 14, 2024

న్యూయార్క్ పిచ్‌లు రంజీ పిచ్‌లలా ఉన్నాయి: దూబే

image

టీ20 వరల్డ్ కప్‌ పలు మ్యాచ్‌లు అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి పిచ్‌లపై స్కోరు కొట్టేందుకు అన్ని జట్లూ చాలా ఇబ్బంది పడ్డాయి. దీనిపై టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబే స్పందించారు. ‘ఆ పిచ్‌లపై సిక్స్ కొట్టడం చాలా కష్టం. సిక్స్ కొట్టాలంటే సరైన అవకాశం కోసం వేచి చూడాల్సిందే. టైం తీసుకోవాల్సిందే. నాకైతే రంజీ ట్రోఫీ ఆడుతున్నట్లుగా అనిపించింది’ అని వివరించారు.

News June 14, 2024

జూన్ 14: చరిత్రలో ఈరోజు

image

✒ ప్రపంచ రక్తదాతల దినోత్సవం
✒ 1916: ప్రముఖ రచయిత బుచ్చిబాబు జననం
✒ 1928: అర్జెంటీనా విప్లవకారుడు చేగువేరా జననం
✒ 1941: సాహితీ చరిత్రకారుడు రంగనాథాచార్యులు జననం
✒ 1961: భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత కె.శ్రీనివాస కృష్ణన్ మరణం
✒ 2014: నటి తెలంగాణ శకుంతల మరణం
✒ 2014: సమరయోధుడు కానేటి మోహనరావు మరణం

News June 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 14, 2024

రూ.3 లక్షలు లంచం.. పారిపోతుండగా అరెస్ట్

image

TG: సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో రూ.15 లక్షలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో రూ.5 లక్షలు ఇచ్చాడు. రెండో విడతలో రూ.3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ పారిపోయాడు. సినిమా స్టైల్‌లో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు.

News June 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:53 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు
ఇష: రాత్రి 8.13 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.